Karthika Deepam dec 6 episode : కార్తీక్ ఎమోషనల్.. ఆందోళనలో సౌందర్య, ఆనందరావు.. సంబురంలో మోనిత!

Karthika Deepam dec 6 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం చాలా ఆసక్తిగా సాగుతోంది. సోమవారం ఈ సీరియల్ 1215 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం.. గత ఎపిసోడ్‌లో మోనిత ప్లాన్ ప్రకారం నర్సు జయంతి ట్యాబ్లెట్స్ కలిపి ఇచ్చిన కాఫీ తాగి మత్తులో ఆపరేషన్ చేయడం వలన ఓ షేషెంట్ చనిపోయిన విషయం తెలిసిందే. మృతుడి భార్య కార్తీక్ వంశం నాశనం అయిపోవాలని శాపనార్ధాలు పెడుతుంది. […].

By: jyothi

Published Date - Mon - 6 December 21

Karthika Deepam dec 6 episode : కార్తీక్ ఎమోషనల్.. ఆందోళనలో సౌందర్య, ఆనందరావు.. సంబురంలో మోనిత!

Karthika Deepam dec 6 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం చాలా ఆసక్తిగా సాగుతోంది. సోమవారం ఈ సీరియల్ 1215 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం.. గత ఎపిసోడ్‌లో మోనిత ప్లాన్ ప్రకారం నర్సు జయంతి ట్యాబ్లెట్స్ కలిపి ఇచ్చిన కాఫీ తాగి మత్తులో ఆపరేషన్ చేయడం వలన ఓ షేషెంట్ చనిపోయిన విషయం తెలిసిందే. మృతుడి భార్య కార్తీక్ వంశం నాశనం అయిపోవాలని శాపనార్ధాలు పెడుతుంది. అది తలచుకుని కార్తీక్ ఎంతో కుమిలిపోతాడు.

ఇక కార్తీక్ ఇంటికెళ్లేసరికి పిల్లలు ఇద్దరూ తండ్రిని హగ్ చేసుకుని ఐస్ క్రీం తినడానికి వెళ్దామని అనుకుంటారు. అయితే, కార్తీక్ తమ్ముడిని తీసుకెళ్లమని చెబుతాడు. జాగ్రత్తగా కారు నడపమని జాగ్రత్తలు చెబుతుండగా సౌందర్యకు అనుమానం వస్తుంది. ఏం జరిగింది వీడికి అంటూ ఆలోచిస్తుంది.

మోనిత సంబంరం.. డాక్టర్ బాబు లైసెన్స్ క్యాన్సిల్..


దీప బస్తీలో సైట్ చూడటానికి వెళ్లిందని తెలుసుకున్న కార్తీక్.. గదిలోకి వెళ్లి బాధపడుతుంటాడు. ఇక మోనిత తెగ ఆనందపడుతూ.. ‘ప్రియమణి త్వరగా రా.. అని పిలుస్తుంది. మీ కార్తీక్ అయ్య డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. అది పోయేలా చేసింది నేనే అంటుంది. దీప మాట్లాడితే నా డాక్డర్ బాబు నా డాక్టర్ బాబు అంటుంది. ఇప్పుడు ఆ డాక్టర్ పదవి పోబోతుందని తెగ సంబుర పడుతుంది. కార్తీక్ మాత్రం తన పిల్లలను తలుచుకుంటూ కుమిలిపోతుంటాడు.అదే టైంలో డాక్టర్ రవి, భారతి మిగిలిన వారు మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటాడు. రోగిని చంపేసావ్.. కార్తీక్ ఇప్పుడు నీ లైసెన్స్ రద్దు అవుతుంది. కౌన్సిల్ ఏం నిర్ణయం తీసుకున్నా నువ్వు దానికి కట్టుబడి ఉండాలని అంటారు వాళ్లు.. ఏదైనా సరే అని డాక్టర్ బాబు అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు.


karthika deepam Dec 6Episode

karthika deepam Dec 6 Episode


ఆందోళనలో సౌందర్య, ఆనందరావు..

గదిలోకి వచ్చిన సౌందర్య, ఆనందరావు కార్తీక్ బాధపడుతుండటాన్ని గమనించి ఆందోళన చెందుతారు. ఏమైందిరా కార్తీక్ అని సౌందర్య అడుగడంతో అసలు విషయం చెబుతాడు డాక్టర్ బాబు..ఇక తల్లి దగ్గర నేను ఏది చేసినా సపోర్టు ఇవ్వాలని మాట తీసుకుంటాడు కార్తీక్.. తల్లిని తీసుకుని బస్తీకి వెళతాడు. అక్కడ మృతుడి శవం వద్ద భార్య గుండెలవిసేలా విలపిస్తుంటుంది. డాక్టర్ కార్తీక్ ను చూసి ఆమె రగలిపోతుంది. డాక్టర్ బాబు చేయి పట్టుకుని తన భర్త మృతదేహం వద్దకు తీసుకెళ్తుంది. ‘చూడయ్యా చూడు.. నా మొగుడిని.. నా పిల్లలను చూడు..’ అంటూ నేలమీద కూలబడి ఏడుస్తుంది. కార్తీక్ కూడా మోకాళ్లపై కూలబడి బాధపడుతాడు. చనిపోయిన నీ భర్తను ఎలాగు నేను తీసుకురాలేను.. కానీ నేను చేయగలిగేది ఒక్కటే అంటూ .. సౌందర్య చేతిలో ఉన్న పేపర్స్‌ను తీసి ఆమె చేతిలో పెడతాడు.. తర్వాతి ఏం జరిగిందో తెలియాలంటే ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది.

Tags

Latest News

Related News