Karthika Deepam December 8 Episode : నిన్నటి ఎపిసోడ్ లో కార్తీక్ తన కారణంగా చనిపోయిన పేషేంట్ ఫ్యామిలీకి తన ఆస్తినంతా ఇచ్చేసి, దీపకు జరిగినదంతా చెప్పేసిన విషయం వరకు చూడము. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవ్వడంతో తర్వాత ఎపిసోడ్ ఉత్కంఠగా మారి పోయింది. ఇక డిసెంబర్ 8 ఎపిసోడ్ లో ఎం జరిగిందో క్లుప్తంగా తెలుసుకుందాం. దీపకి జరిగిన విషయం చెప్పి దీప, పిల్లల్తో పాటు కార్తీక్ చేతిలో తన బ్యాగ్ తో రోడ్డు మీద నడుస్తున్న సీన్ చూసి ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యారు.
కార్తీక్, దీప ఈ విషయం గురించి ఆలోచిస్తూ బాధగా ఎవొద్దు మీద నడుస్తూ ఉంటె పిల్లలు మాత్రం మనం ఇంట్లో నుండి చెప్పకుండా ఎందుకు బయటకు వచ్చాం అని దీపను కార్తీక్ ను అడుగుతారు. ఆ ప్రశ్నకు దీప సప్రైజ్ కదా అంటూ మాట దాటేస్తుంది. ఆ తర్వాత పిల్లలు మరొక ప్రశ్న సాధిస్తారు. మనం ప్రతిసారి ఇలా నడిచి వెళ్ళం కదా.. ఈసారి ఎందుకు నడుస్తూ వెళ్తున్నాం అంటూ అడిగితే ”అంటే ఇది ఒకే చోటుకి కాదు కదా.. మనం ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కుతాం.. ఎక్కడ దిగాలనిపిస్తే అక్కడ దిగుతాం.. ఈ టూర్ స్పెషాలిటీ ఇదే అంటూ దీప అబద్ధం చెబుతుంది.
ఆ తర్వాత కార్తీక్ కు మోనిత కాల్ చేయడంతో దీప ఒక్క నిముషం ఇప్పుడే వస్తా అంటూ కార్తీక్ ఫోన్ దూరంగా తీసుకువెళ్లి పడేస్తాడు. కార్తీక్ ఫోన్ పడేయడం పక్కన ఉన్న ఒక వ్యక్తి చూస్తాడు. ఈ లోపు బస్సు రావడంతో కార్తీక్, దీప పిల్లల్తో కలిసి బస్సు ఎక్కేస్తారు.. వాళ్ళు వెళ్ళగానే ఫోన్ పడేయడం చుసిన వ్యక్తి వచ్చి ఫోన్ తీసుకుంటాడు. ‘ఇదేంటి ఫోన్ పడేసి వెళ్తున్నాడు.. ఎం అయ్యి ఉంటుంది అని మనుసులో అనుకుంటాడు.
Karthika Deepam December 8 Episode
ఇక మోనిత మాత్రం చాలా స్నాతోషంగా అదే రాత్రి ప్రియమణిని నిద్రలేపి.. చాలా గుడ్ న్యూస్ ప్రియమణి మీ కార్తీక అయ్యా డాక్టర్ పదవి పోయింది.. పోగొట్టేసాను అంటూ చెప్పడంతో ప్రియమణి షాక్ అయ్యి.. అమ్మ మీ పాగా దీపమ్మ మీద కదమ్మా.. కార్తీక్ అయ్యపై తీర్చుకుంటే మీకేమొస్తుంది? అంటూ ప్రశ్నిస్తే.. అదే నా ప్లాన్ ప్రియమణి.. పని లేని మగాడు గడ్డిపోచతో సమానం.. ఆ పరిస్థితిని కార్తీక్ భరించలేడు.. ఆ[[యూదు నా హాస్పిటల్ లో అసిస్టెంట్ గా జాబ్ ఇస్తాను.. నా దగ్గరే ఉండేలా ప్లాన్ చేసి దీపకు మెల్లగా దూరం చేస్తాను అంటూ తన ప్లాన్ ను ప్రియమణికి చెబుతూ సంతోషిస్తుంది మోనిత.
ఇక తర్వాత రోజు ఉదయం సౌందర్య, ఆనందరావు నిద్రలేచి వాకింగ్ చేస్తూ దీప, కార్తీక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ”నైట్ బ్యాంక్ వాళ్లతో మాట్లాడనండి.. పెద్దోడికి 5 కోట్లు లోన్ వచ్చేలా చేస్తాను.. బిజినెస్ పెట్టిద్దాం.. అని చెబుతుంది భర్తతో.. ఆ తర్వాత దీపము పిలుస్తుంది కానీ రాదు.. శ్రావ్య వస్తుంది.. ఉదయం నుండి నేను దీప ను చూడలేదు అత్తయ్య అంటుంది. ఆ తర్వాత శ్రావ్య హాల్ లో లెటర్ కనిపిస్తే చూసి చదివి అత్తయ్య..అత్తయ్య అంటూ అరుస్తుంది.
సౌందర్య కూడా లెటర్ తీసుకుని చదువుతుంది.. ”నేను ఓడిపోయాను.. ఇన్నాళ్లు తప్పు నేను చేస్తే శిక్ష మీకు పడింది.. అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను కట్టుకున్నందుకు, నేను కన్నందుకు దీపకు, పిల్లలకు తప్పదు..అందుకే వాళ్ళని తీసుకుని వెళ్తున్నా..నా కోసం వెతకవద్దు.. అని లెటర్ లో ఉన్నది చదవగా అందరు ఏడుస్తారు. ఆదిత్య నేను వెతికి తీసుకు వస్తా అని చెబుతాడు. కావాలని వెళ్లిన వాళ్ళను పట్టుకోవడం అంత సులభం కాదని శ్రావ్య ఏడుస్తూ చెబుతుంది.
అప్పుడు ఆనందరావు.. దీప ఉన్నంత వరకు కార్తీక్ ఓడిపోడు.. దీప ఉంది అని ఆశాభావం వ్యక్తం చేస్తాడు. ఇక సరిగ్గా అదే సమయంలో కార్తీక్ ఎదో ఊరిలో దిగగా.. రాయి తగిలి పడిపోతుండగా దీప పట్టుకుని పడిపోకుండా ఆపుతుంది. ఇక ఈ ఎపిసోడ్ లో ఆ సీన్ హైలెట్ అనే చెప్పాలి. మరి వారు ఏ ఊరు వెళ్లారు.. అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే.