Karthika Deepam december7 episode : డాక్టర్ బాబు ఆస్తి మాయం.. దీప ఏం చేయబోతుంది…

Karthika Deepam december7 episode : బుల్లితెర ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్న కార్తీక దీపం నేటితో 1217వ ఎపిసోడ్ లోకి వచ్చింది. ఈ రోజు కార్తీక్ ఇంటికి వచ్చి కుమిలి, కుమిలి ఏడుస్తుంటాడు. దానికి సౌందర్య, ఆనందరావు కార్తీక్ ను ఏమైందని అడుగుతారు. దాంతో కార్తీక్ జరిగింది మొత్తం వారితో చెబుతాడు. (మత్తులో ఆపరేషన్ చేసి ఓ పేషంట్ చావుకి కారణం అవడంతో కార్తీక్ డాక్టర్ లైసెన్స్ రద్దు అవుతుంది. ). చనిపోయిన పేషంట్ ఇంటికి కార్తీక్ […].

By: jyothi

Published Date - Tue - 7 December 21

Karthika Deepam december7 episode : డాక్టర్ బాబు ఆస్తి మాయం.. దీప ఏం చేయబోతుంది…

Karthika Deepam december7 episode : బుల్లితెర ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్న కార్తీక దీపం నేటితో 1217వ ఎపిసోడ్ లోకి వచ్చింది. ఈ రోజు కార్తీక్ ఇంటికి వచ్చి కుమిలి, కుమిలి ఏడుస్తుంటాడు. దానికి సౌందర్య, ఆనందరావు కార్తీక్ ను ఏమైందని అడుగుతారు. దాంతో కార్తీక్ జరిగింది మొత్తం వారితో చెబుతాడు. (మత్తులో ఆపరేషన్ చేసి ఓ పేషంట్ చావుకి కారణం అవడంతో కార్తీక్ డాక్టర్ లైసెన్స్ రద్దు అవుతుంది. ). చనిపోయిన పేషంట్ ఇంటికి కార్తీక్ మరియు సౌందర్య కలిసి వెళ్తారు.


అక్కడ చనిపోయిన వ్యక్తి భార్య నీలవేణి ఏడుస్తూ ఉంటుంది. వీరిని చూసిన నీలవేణి ఏంటి మళ్లీ వచ్చావ్. పూర్తిగా చచ్చాడో లేదో చూసేందుకా? అని కోపానికి వస్తుంది. నీ పిల్లలు నాశనమైపోతారంటూ శాపనార్థాలు పెడుతుంది. దీంతో కార్తీక్ ఆమెను తన పిల్లల కోసమే తాను బతుకుతున్నానని తన పిల్లల నాశనమైపోతారని శాపనార్థాలు పెట్టొద్దని ఆమెను వేడుకుంటాడు.


కార్తీక్ తన ఆస్తినంతా నీలవేణి పేర రాయించి ఆస్తి పత్రాలను తీసుకుని వస్తాడు. ఆ పత్రాలను నీలవేణికి ఇచ్చేందుకు ప్రయత్నించగా.. నీల వేణి తనకు ఆస్తి వద్దు తన భర్తే కావాలని అడుగుతుంది. దాంతో కార్తీక్ ఆ పత్రాలను శవం కాళ్ల దగ్గర పెట్టి కుమిలిపోతాడు. అక్కడే ఉన్న సౌందర్య కార్తీక్ ను ఓదారుస్తుంది. ఇక దీప ఆస్పత్రి స్థలం చూసేందుకు వెళ్తుంది. దీపకు వారణాసి ఓ స్థలాన్ని చూపిస్తాడు. దీంతో దీప వారణాసిని మెచ్చుకుంటూ భలే స్థలం చూశారు. వారణాసి. ఇక్కడే ఆస్పత్రి కడతాం. మొత్తం ఐదంతస్థులు. ఆ పైన మాఇల్లు ఉంటుంది అంటూ వారణాసికి చెబుతుంది. వారణాసి త్వరగా స్థలానికి అడ్వాన్స్ ఇవ్వండి అక్కా లేకపోతే కక్కర్తి మనుషులు వేరే వాళ్లకు అమ్ముకుంటారు అని అంటాడు. దీంతో వారణాసి దీపను అక్కా నేను నిన్ను ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను పదక్కా అని తీసుకుని వెళ్తాడు.


karthika deepam Dec 7Episode

karthika deepam Dec 7 Episode



ఇంటికి వచ్చిన కార్తీక్ సౌందర్యలకు ఆనందరావు నీళ్లు అందజేసి కాళ్లు కడుక్కుని వచ్చి ఇంట్లో కూర్చోమంటాడు. వచ్చే దారిలో కార్తీక్ సౌందర్యను క్షమించమని అడుగుతాడు. ఒక చెడ్డ కొడుకును, ఒక చెడ్డ భర్తను అయిన నేను ఇప్పుడు ఒక బ్యాడ్ డాక్టర్ ని కూడా అయిపోయాను మమ్మీ అని ఏడుస్తాడు. దానికి సౌందర్య కార్తీక్ ని ఓదారుస్తుంది. ఆస్తి అంతా ఇచ్చేశావు కదరా నీదేం తప్పు లేదులే అంటుంది. కానీ కార్తీక్ కు మనసులో చనిపోదాం అన్న భావన కలుగుతుంది. కార్తీక్, సౌందర్య, ఆనందరావు ముగ్గురూ సోఫాలో కూర్చోగానే.. బయట వారణాసి దీపను డ్రాప్ చేస్తాడు. దీంతో దీప సంతోషంగా ఇంటిలోపలికి వచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే దీపకు ఇలా జరిగిందని ఇంకా తెలియదు.

Tags

Latest News

Related News