Karthika Deepam Nov 12th episode : మోనితకు దిమ్మదిరిగే షాకిచ్చిన దీప.. ఓ గాడిద స్టోరీ చెప్పి భలే ఆటాడుకుందిగా..!

Karthika Deepam Nov 12th episode : బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ థ్రిల్లింగా సాగుతోంది. శుక్రవారం నవంబర్ 12వ తేదీన 1,195 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. దీని హైలెట్స్ ఇప్పుడు చూద్దాం… దీప బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఓ ఆటోను ఆపి చివరగా ఓ చోటుకు వెళ్లాలని అంటుంది. మళ్లీ రావాలా అని డ్రైవర్ అడుగగా. వద్దు అక్కడ దింపితే చాలని దీప అనడంతో.. చనిపోవడానికి వెళ్తుందేమో అని ప్రేక్షకులు భావిస్తారు. ఇకపోతే మోనిత.. […].

By: jyothi

Updated On - Fri - 12 November 21

Karthika Deepam Nov 12th episode : మోనితకు దిమ్మదిరిగే షాకిచ్చిన దీప.. ఓ గాడిద స్టోరీ చెప్పి భలే ఆటాడుకుందిగా..!

Karthika Deepam Nov 12th episode : బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ థ్రిల్లింగా సాగుతోంది. శుక్రవారం నవంబర్ 12వ తేదీన 1,195 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. దీని హైలెట్స్ ఇప్పుడు చూద్దాం… దీప బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఓ ఆటోను ఆపి చివరగా ఓ చోటుకు వెళ్లాలని అంటుంది. మళ్లీ రావాలా అని డ్రైవర్ అడుగగా. వద్దు అక్కడ దింపితే చాలని దీప అనడంతో.. చనిపోవడానికి వెళ్తుందేమో అని ప్రేక్షకులు భావిస్తారు. ఇకపోతే మోనిత.. ప్రియమణి నేనే గెలిచాను అంటుండగా ఎలాగమ్మా అని అడుగుతుంది. దీపను ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేశాను. ఇక ఆ ఇంట్లో అడుగుపెట్టడమే తరువాయి అనుకునేలోపు గుమ్మం ముందు దీప కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు ప్రియమణి, మోనిత..

వంటలక్కను నానా మాటలన్న మోనిత..

ఎంటీ దీపక్కా ఇలా వచ్చావు. దారి మర్చిపోయావా? లేదా నీ చెల్లెలితో కాళ్ల బేరానికి వచ్చావా? అనడంతో ‘మోనిత నోరు అదుపులో పెట్టుకో..’అని గట్టిగా అంటుంది దీప.. అయినా మోనిత అంతటితో ఆగకుండా చూశావా కార్తీక్ తో బిడ్డను కని పూజ కూడా చేశాను. జైలుకి వెళ్లేటప్పుడు చెప్పానుగా నా జీవితానికి ఇది క్లైమాక్స్ కాదని గుర్తుందా అని అడుగుతుంది మోనిత..

గాడిద స్టోరీ చెప్పి మోనితకు క్లాస్ పీకిన దీప..

పూర్వం ఓ రాజు ఉండేవాడు.. వేటకు వెళ్తుండగా ఓ వ్యక్తి వచ్చి అటు వెళ్లకండి వర్షం పడుతుందంటే వినకుండా వెళ్లి.. రెండ్రోజులు చచ్చిచెడి తిరిగొస్తాడు. తర్వాత ఆ వ్యక్తిని తీసుకురమ్మని చెప్పగా.. వర్షం పడుతుందని నీకు ఎలా తెలుసని అడుగగా.. మా గాడిద చెవులు వర్షం పడే ముందు రెండుసార్లు టపాటపా కొట్టుకుంటాయి.

Karthika Deepam November 12 Episode-1

Karthika Deepam November 12 Episode-1

అప్పుడు వర్షం పడుతుందని చెప్పగా.. ఆ గాడిదను రాజు మంత్రిగా చేర్చుకుంటాడు. దానిని చూసి మిగతా గాడిదలు కూడా మంత్రి కావాలని అలానే చేస్తాయట. ఆశపడటానికి అడ్డ గాడిదలకు ఏ పని ఉంటుంది చెప్పు అంటుంది దీప.. అంటే ఈ స్టోరీలో రాజు కార్తీక్, మంత్రి గాడిద దీప, ఆశపడే అడ్డ గాడిద మోనిత అని సారాంశం..

ఏం చేసి బతుకుతావు అని అడిగావ్ కదా.. నేను వంటలక్కనే.. ఏ కూరలో ఎంత మసాలా వేయాలో నాకు బాగా తెలుసు. అలాగే జీవితంలో కూడా.. నువ్వు స్టోరీ అయిపోయిందనకుంటున్నావ్.. లేదు ఇప్పుడే మొదలైంది. మర్యాదగా పూజ చేసేటప్పుడు తీసిన ఫోటోస్ ఇవ్వు.. లేకపోతే నేనేంటో చూపిస్తా అంటూ మోనిత, ప్రియమణికి వార్నింగ్ ఇస్తుంది దీప.. తర్వాత ఏం జరిగిందంటే ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది.

Tags

Related News