Karthika Deepam nov 15th episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’నవంబర్ 15వ తేదీన 1,197 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజా ఎపిసోడ్ హైలెట్స్ ఎంటో ఇప్పుడు చూసేద్దాం. బస్తీ నుంచి ఇంటికి వచ్చిన దీపను ఆపి ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు కార్తీక్. భవిష్యత్ కోసం మళ్లీ ఒక్కసారి వంటలక్కగా ప్రాక్టిస్ చేయడానికి వెళ్లా అని చెప్పడంతో షాక్ అవుతాడు డాక్టర్ బాబు. ఇకపోతే మోనిత బుల్లి ఆనందరావుకు ఏం కావాలో తీసుకుని రావాలని ప్రియమణికి డబ్బులు ఇస్తుంది. కింద పడిన కాగితం తీస్తుండగా అప్పుడే భారతి వచ్చి మోనిత మెడలో ఉన్న తాళిని చూస్తుంది. మోనితా ఈ తాళి ఏంటీ? కార్తీక్ కట్టాడా అని ప్రశ్నించగా లేదు నేనే కట్టుకున్న అంటుంది మోనిత..
మోనిత, భారతి ఆడిన నాటకమా..
తాళి నువ్వు ఎలా కట్టుకుంటా మోనిత.. అది చాలా తప్పు.. నువ్వు కరెక్ట్ కాదు.. బిడ్డ పేగులు మెడలో వేసుకుని పుట్టకముందే నాతో అబద్ధం చెప్పింది ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ఇదంతా వారికి తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా అని కోపంతో అంటుంది భారతి. కార్తీక్ నాకు దొరకడం కంటే కరెక్ట్ ఏది కాదు అనేస్తుంది మోనిత.
Karthika Deepam nov 15th episode-1
ఆ టాపిక్ వెంటనే కట్ చేసిన మోనిత.. అసలు విషయం నీకు చెప్పలేదుగా.. దీప మా ఇంటికి వచ్చి వెళ్లింది.. కార్తీక్‌తో నేను అంత చేసినా దాని ధైర్యం ఏంటో ఇంకా నాకు అర్థం కావడం లేదు భారతి’అంటూ ఇప్పటివరకు జరిగినదంతా చెబుతుంది. మరోవైపు వంటలక్క బిహేవియర్ గురించి సౌందర్య, కార్తీక్‌లు మాట్లాడుకుంటున్నారు. దీప ప్రవర్తన చూస్తే భయంగా ఉందిరా కార్తీక్.. ఏంమాట్లాడాలో కూడా అర్థం కావడం లేదంటుంది సౌందర్య.
తనకు అన్ని తెలిసే ఈ విధంగా యాక్ట్ చేస్తుందా అని అనుమానపడుతుంది సౌందర్య. ఆనందరావు కూడా అదే అనుకుంటుంటారు. ఇంతలో పిల్లలకు జోక్స్ చెబుతూ నవ్వుతూ కిందకు వస్తుంది దీప. అమ్మ మంచి జోక్స్ చెబుతోంది డాడీ అంటూ పిల్లలు అనగానే.. నా జీవితంలో అంతకంటే పెద్ద జోక్స్ జరిగాయి.. వాటితో పోలిస్తే ఇదెంతా అని వెటకారంతో అంటుంది దీప.. దీంతో ఆనందరావు, సౌందర్య, కార్తీక్‌ల నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు.
ఈ ఇంట్లో డాక్టర్ బాబు ఏది చెబితే అదే చెల్లాలి. అందుకే ఆయనకు నచ్చిన కూరలు చేశాను. రండి తిందాం అని అందరినీ పిలుస్తుంది. అది వేసుకోండి ఇది వేసుకోండి బాగుంటుంది అంటూనే ఇది మీకోసమే చేశాను. దీనికి ఎన్ని మార్కులు ఇస్తారని అడుగుతుంది దీప.. ఇంతలో ఏమైంది వదినా అదోలా ఉంటున్నావని అడుగుతాడు ఆదిత్య. ప్రతీసారి ఏడుపు మొహం పెడితే అందరూ నన్ను ఇంకా ఏడిపిస్తున్నారు. అందుకు నవ్వుతున్నానని అంటుంది దీప. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది.