Karthika Deepam nov 17 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీక దీపం’ సీరియల్ బుధవారం (నవంబర్ 17)న 1,199 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజా ఎపిసోడ్‌లో ఏం జరిగిందో దాని హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం..
దీప ఫ్యామిలీని ఎలాగైనా డిస్టప్ చేయాలని ‘మోనిత’ కన్నింగ్ స్కెచ్ వేసింది. ‘కార్తీక్’ తమ్ముడు ‘ఆదిత్య’ను పిలిచి జరిగిందంత వివరిస్తుంది. నిజం తెలియడంతో ఆవేశంగా వెళ్లిన ఆదిత్య ఇంట్లో అందరికీ ఈ విషయం చెబుతాడు, జరిగిన దానికి రచ్చ చేస్తాడేమో అని అంతా అనుకుంటారు. కానీ దారిలో కార్తీక్ కనిపించడంతో నిలదీస్తాడు. ఏం జరుగుతుందని అడుగగా.. నా తప్పు ఏమీ లేదని చెబుతాడు.
మోనితతో కలిసి పూజ చేస్తుంటే మీ వదిన మొత్తం చూసేసింది. నీలాగా గట్టిగా నిలదీసి అడిగితే బాగుండు. కానీ అలా చేయడం లేదు తను. అందుకే నాకు భయంగా ఉందని కార్తీక్ ఎమోషనల్ అవడంతో ఆదిత్య కూల్ అవుతాడు. దీపతో నేనే మాట్లాడి అసలు నిజం చెబుతాను. నువ్వేం మాట్లాడకు.. మోనితను కలిసినట్టు మీ వదినకు చెప్పకు అని కార్తీక్ రిక్వెస్ట్ చేయడంతో.. జరిగింది ఏదైనా వదినతో నువ్వే మాట్లాడు అని ఆదిత్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
kaarthika deeepam 17
బెడిసి కొట్టిన ప్లాన్.. పప్పులో కాలేసిన మోనిత..
ఆదిత్యకు అంతా తెలిసింది.. ఇక ఆనందరావు ఇంట్లో ప్రళయమే అనుకుంటూ సంబుర పడుతుంది మోనిత. ఇంతలో ప్రియమణి‘పాపం కదమ్మా’అంటుంది. మోనిత కోపంగా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండూ అంటూ కసురుకుంటుంది. దీంతో ఈమె దగ్గర పనిచేయడం ఏ నాటి కర్మో అనుకుంటూ వెళ్లిపోతుంది ప్రియమణి. ఇక పోతే కార్తీక్ కొత్త చీరలు తీసుకొచ్చి సౌందర్య ముందు పెడతాడు. దీపతో మాట్లాడే చాన్స్ ఇలాగైనా వస్తుందేమోనని ఆశ మమ్మీ అంటాడు కార్తీక్.. దీనంగా చూస్తూ రేయ్ పెద్దోడా.. దీపతో ఏం మాట్లాడుతావ్.. తను ఇకపై ఒంటరిగా బతికేస్తా అంటే తట్టుకోగలవా? నేనే ముందు మాట్లాడతానులే అని కొడుక్కు సర్ది చెబుతుంది సౌందర్య.
సౌందర్యను ఇరుకున పెట్టిన దీప..
మోనిత చెప్పింది తలుచుకుంటూ లోలోపల మథన పడుతుంటాడు ఆదిత్య. ఇంతలో శ్రావ్య వచ్చి ఏం జరిగింది అని అడుగగా ఏం చెప్పుకుండా తప్పించుకుంటాడు. దీప వంట గదిలో ఉండగా, నేను వెళ్లి తనతో మాట్లాడి వస్తాను అని కార్తీక్ తో అంటుంది సౌందర్య. లోపలకు వెళ్లగా దీప మాత్రం సౌందర్యను తన మాటలతో ఇరుకున పెడుతుంది. మీరు మారిపోయారు అత్తయ్యా.. గంభీరంగా ఉండటం లేదని మాట మార్చి సౌందర్యను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మోనిత మాత్రం ఏదో జరగబోతుందని భ్రమలోనే ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘కార్తీక దీపం’కొనసాగుతుంది.