Karthika Deepam nov 18 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ నవంబర్ 18వ తేదీతో 1200 ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ భాగంలోని హైలెట్స్ ఎంటో ఇప్పుడు చూసేద్దాం..
పండుగ పూట ఇంట్లో దీపాలు పెడుతూ కార్తీక్‌ను తలుచుకుంటూ రగిలిపోతుంది మోనిత. వెంటనే కార్తీక్‌కు కాల్ చేస్తుంది. హలో.. డాక్టర్ కార్తీక్కా మాట్లాడేది అంటూనే మొదలెడుతుంది మోనిత..‘ప్రాణేశ్వరా ఇది కొత్త నంబర్.. నేను మీవీధి చివర నీకోసం ఎదురుచూస్తున్నాను.. నువ్వు వస్తావా? నేనే రావాలా? అని బ్లాక్ మెయిల్ చేస్తుంది మోనిత.. కార్తీక్ వెళ్ళి ఎంటో తేల్చుకుంటానని అనుకోవడంతో సరిగ్గా అదే టైంలో మీతో మాట్లాడాలని దీప పిలుస్తుంది. మోనిత మళ్లీ మళ్లీ కాల్ చేస్తుండటంతో అక్కడ నుంచి బయలు దేరుతాడు డాక్టర్ బాబు.
నేను నిన్న ఏదైనా చేయగలను కార్తీక్..
రావడం రావడంతోనే కార్తీక్ మోనితపై మండిపడతాడు. కానీ మోనిత మాత్రం నేను ఏదైనా చేయగలను కార్తీక్. అదే చేశాను కూడా అంటుంది మోనిత. ఇపుడు ఇదంతా నడిపిస్తున్నది కూడా నేనే. ఇది మీ ఏరియా నువ్వు ఏమైనా చేస్తే నీ పరువే పోతుంది.నేను దేనికైనా రెడీ అనడంతో ఓవరాక్షన్ చేయకు మోనిత అంటాడు కార్తీక్. నేను ఓవరాక్షనే చేస్తాను కార్తీక్ అంటూనే నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ఏమవుతుందో తెలుసా అంటూనే వెల్ కమ్ మై టీం అంటూ తన వాళ్లను పిలుస్తుంది మోనిత..
kaarthika deepam 18
కార్తీక్‌కు చిరాకు తెప్పించిన సెల్ఫీ బ్యాచ్
కార్తీక్ కోపంగా చూస్తూనే నువ్వు ఏమైనా చేసుకో నేను నీకు భయపడను అంటూ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఇంతలో కొంత మంది వచ్చి కార్తీక్ చుట్టూ చేరతారు.. హాయ్ సార్ మీతో ఒక ఫొటో దిగాలి అంటూ మొబైల్స్ పట్టుకుని క్లిక్ చేయబోతుంటారు. ఆపండి ఎవరు మీరంతా అని కార్తీక్ అరుస్తూ ఉంటుండగా.. సార్ మీతో ఒక ఫోటో దిగి పెడితే చాలు బోలెడు లైక్స్, కామెంట్స్ వస్తాయని వారు అంటుంటారు. కార్తీక్ గట్టిగా అరిచేసరికి వీళ్లంతా నీ అభిమానులు కార్తీక్.. వీరిని నేనే పిలిచా అని అంటుంది మోనిత.
ఏంటి ఇదంతా అని అడుగడంతో వీళ్లంతా నా హాస్పిటల్ ఫ్రెండ్స్. నువ్వు నన్ను కలిపి ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే ఎలా ఉంటుందో నీకు తెలుసుగా అని మోనిత అనడంతో కార్తీక్ వెంటనే కారెక్కి ఇంటికి వెళ్లిపోతాడు. తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందంటే ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది.