• Telugu News
  • movies

Karthika Deepam nov 19 episode : దీప గురించి భయపడి బోరున విలపించిన సౌందర్య.. సమాధులు చూద్దామన్నది అందుకేనా?

Karthika Deepam nov 19 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీకదీపం’సీరియల్ శుక్రవారం నవంబర్ 19 వ తేదిన 1,201 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ భాగంలోని హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం.. సౌందర్యను బాధపెట్టిన దీప.. దీపావళి రోజున ఇంట్లో సందడే లేకుండా పోయిందని సౌందర్య అనడంతో సౌర్య, హిమలు బాధపడుతుంటారు. నానమ్మ గతంలో మనం పండుగకు బయటకు వెళ్లేవాళ్లం కదా? ఈరోజు కూడా గోల్గొండ వెళ్దామా? అంటారు. ఈ రోజు అమ్మ పుట్టినరోజు కూడా […].

By: jyothi

Published Date - Fri - 19 November 21

Karthika Deepam nov 19 episode : దీప గురించి భయపడి బోరున విలపించిన సౌందర్య.. సమాధులు చూద్దామన్నది అందుకేనా?

Karthika Deepam nov 19 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీకదీపం’సీరియల్ శుక్రవారం నవంబర్ 19 వ తేదిన 1,201 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ భాగంలోని హైలెట్స్ ఇప్పుడు చూసేద్దాం..

సౌందర్యను బాధపెట్టిన దీప..

దీపావళి రోజున ఇంట్లో సందడే లేకుండా పోయిందని సౌందర్య అనడంతో సౌర్య, హిమలు బాధపడుతుంటారు. నానమ్మ గతంలో మనం పండుగకు బయటకు వెళ్లేవాళ్లం కదా? ఈరోజు కూడా గోల్గొండ వెళ్దామా? అంటారు. ఈ రోజు అమ్మ పుట్టినరోజు కూడా ఉంది కదా? అనడంతో అప్పుడే దీప వస్తుంది. ఏం దీప నీ బర్త్ డే అంట కదా అని సౌందర్య అడుగడంతో మర్చిపోయాను అత్తయ్యా అంటుంది.. పిల్లలు చారిత్రక కట్టడం గోల్గొండ వద్దకు వెళ్దాం అంటున్నారు పోదామా? అంటే వద్దు కానీ ఆ పక్కనే సమాధులు ఉంటాయ్ వాటిని చూద్దామని వెటకారంగా అంటుంది దీప.

అక్కడకు ఎందుకు అమ్మా అని పిల్లలు అడిగితే అవి చరిత్ర జీవనాధారాలు. మనం కూడా అక్కడకు వెళ్లేవాళ్లమే అనడంతో.. అవేం మాటలే దీప.. పుట్టిన రోజు నాడు ఇలా మాట్లాడుతున్నావ్ అని కోపడుతుంది సౌందర్య. మరి గుడికి వెళ్దామా అని సౌర్య అడిగితే ఇప్పటికే మీ నానమ్మ వెళ్లొచ్చిందిగా అని సెటైర్ వేస్తుంది దీప. ఇంతకూ మనం బయటకు వెళ్తున్నామా లేదా? అని సౌర్య అనగా ఎక్కడకు వెళ్లేది లేదని అంటుంది దీప.

kaarthika deepma

kaarthika deepma

ఈ క్రమంలోనే దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారని పిల్లలు అడుగగా పూర్వం రాక్షసులు, మనుషులు వేర్వేరుగా ఉండేవారు. రాక్షసులు మనుషులను ఇబ్బంది పెట్టినప్పుడు దేవుళ్లు సంహరించేవారు. బాధలు తొలగిపోయినందుకు చిహ్నంగా పండుగ చేసుకుంటారని చెబుతుంది దీప. కానీ ఇప్పుడు మనుషుల్లోనే రాక్షసులు ఉన్నారు అనడంతో ఆ మాట సౌందర్యకు గట్టిగా తగులుతుంది. దీంతో అక్కడ నుంచి లేచి వెళ్లిపోతుంది.

దీప చనిపోతుందని కుమిలిపోయిన సౌందర్య..

దీప అంటున్న మాటలకు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని కుమిలికుమిలి ఏడుస్తుంది సౌందర్య. దీంతో ఆనందరావు తన భార్య వద్దకు వచ్చి ఓదారుస్తాడు. దీప పిరికిది కాదు. ఆత్మహత్య చేసుకోదు అని ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తాడు. దీప అవసరానికి మించి సంతోషంగా ఉందని, మరణించే ముందు ఎలా మాట్లాడుతారో అలానే మాట్లాడుతుందని సౌందర్య భయపడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కార్తీక్ దీపకు నిజం చెప్పినట్టు కల కంటాడు. మోనితది అద్దె గర్భం కాదని, సహజమైన గర్భం అని చెప్పినట్టు అనుకుంటాడు. అప్పుడే సౌందర్యకు మోనిత ఫోన్ చేసి‘రేపు మా బాబు బారసాల ఉంది తప్పకుండా రావాలని అంటుంది. ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది.

Tags

Latest News

Related News