Karthika Deepam Nov 20 Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే కార్తీకదీపం సీరియల్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ సీరియల్ కు క్రేజ్ ఎక్కువ. ఎప్పటికప్పుడు ట్విస్టులతో మంచి మూమెంట్ లో కథ సాగుతున్నది మరి ఈ రోజు (నవంబర్ 20, 2021)న టెలికాస్ట్ అయ్యే 1202 ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం.
కార్తీక్ వాళ్ల ఇంట్లో అందరూ దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో ఫోన్ వస్తుంది. ఆంటీ.. నేను మీ కోడలిని అంటుంది మోనిత. ఎందుకు ఫోన్ చేశావని కార్తీక్ తల్లి సీరియస్ గా మాట్లాడుతుంది. ఎంతైనా నేను మీ కోడలిని.. మీ మనువడికి ఒంట్లో బాగోలేదు. కార్తీక్ ను ఒక సారి రమ్మని చెప్పండి, లేకుంటే మీరైనా రండి అని చెబుతుంది మోనిత..
ఇంతలోనే ఫోన్ లో కార్తీక్ వాయిస్ మోనితకు వినిపిస్తుంది. జాగ్రత్త దీప.. చీర కాలుతుంది అని కార్తీక్ అనడంతో సీరియస్ అయిన మోనిత ఫోన్ కట్ చేస్తుంది. ఈ దీప ఏం చూసుకుని ఇంత ధైర్యంగా ఉంటుంది. ఆమెకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటూ మోనిత ఆలోచిస్తుంది. తన మీద కార్తీక్ కు ప్రేమ పెరగలేదని, దీపపై తగ్గలేదని మనసులో అనుకుంటూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే.. కార్తీక్ సైతం ఆలోచనలో పడతాడు. అదే టైంలో ఆనందరావు, సౌందర్య వచ్చి దీప విషయం మాట్లాడటం మొదలుపెడతారు.
Karthika Deepam Nov 20 Today Episode-1
అప్పటికే దీప పిల్లలకు కథ చెబుతూ ఉంటుంది. అనంతరం గుడికి వెళ్తున్నామని చెప్పిన దీప.. అత్తయ్య మీరు కూడా వస్తారా? అని అడుగుతుంది. ఇంతలో రౌడీ మాట్లాడుతూ అమ్మకి బర్త్ డే విషెస్ చెప్పరా అని ప్రశ్నిస్తుంది. దీనికి దీప స్పందిస్తూ వారు ఎప్పుడో చెప్పారు అంటూ అంటుంది దీప. అత్త, మామయ్య ఒక చోట నిల్చోండని చెప్పి వారి ఆశీర్వాదం తీసుకుంటుంది. అదే టైంలో మోనిత ఎంట్రీ ఇస్తుంది. హ్యాపీ బర్త్ డే అంటూ దీపను విష్ చేస్తుంది. మోనిత ఎంట్రీతో అందరూ షాకవుతారు.
అయితే మోనితకు దీప థాంక్స్ చెబుతుంది. అనంతరం మోనిత అందరినీ పలకరించినా ఎవరూ మాట్లాడరు. కానీ కార్తీక్ మోనితపై సీరియస్ అవుతూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపొమ్మని చెబుతాడు. కానీ దీప మాత్రం మోనిత యోగ క్షేమాలు కనుక్కుంటుంది. వారి వెంట గుడికి రమ్మని అడుగుతుంది. నేను గుడికి రానని.. రేపు మా బాబు బారసాల చేస్తున్నాం.. మీరే మా ఇంటికి రావాలని చెబుతుంది మోనిత. దీంతో కార్తీక్ సీరియస్ అవుతాడు. ఇంతలో దీప మోనితతో మాట్లాడుతూ నువ్వు టెన్షన్ పడకు.. వీళ్లను నేను తీసుకొస్తానని మాటిస్తుంది దీప.