Karthika Deepam nov 22 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 22 నవంబర్ రోజున 1,203 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులోని హైలెట్స్ ఎంటో ఇప్పుడు చూసేద్దాం.. సీరియల్ స్టార్ట్ అవ్వగానే మోనిత ఇంటికి వచ్చ రేపు మా బాబు బారసాల ఉంది. అందరూ రావాలనడంతో కార్తీక్, సౌందర్య నో అంటారు.
అక్కడే ఉన్న ‘దీప’ అందరూ వస్తారు..! నువ్వు నిశ్చింతగా వెళ్లు అనడంతో మోనితకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. షాక్ లో ఉన్న సౌందర్యను చూసి మీరు ఇప్పుడు వచ్చేలా లేరు. మేమే వెళ్తామని పిల్లలను తీసుకుని వారణాసి కారులో గుడికి వెళ్తుంది దీప. ఇక మోనిత మాత్రం ఆలోచిస్తూ వెళ్తుంటుంది. దీప ఏం చేయబోతుంది, దానికి ఎంత ధైర్యం ఎలా వచ్చింది.. ఏం ప్లాన్ చేసిందనుకుంటూ కారులో వెళ్తుంటుంది.
కార్తీక్, సౌందర్యకు దీప గుణం ఏంటో చెప్పిన ఆనందరావు..
దీప అన్న మాటలకు అందరూ షాక్ లోనే ఉంటారు. దాని కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోతున్నాను రా కార్తీక్.. అంటూ సౌందర్య మదనపడుతుంది. దీప ఎంత గొప్పది కాకపోతే అన్నీ తెలసినా మనల్ని ఏం అనకుండా నవ్వుతూ మాట్లాడుతోంది. అది ఎందరికి సాధ్యం సౌందర్య. కోపంగా మాట్లాడితే చాలనుకుంటున్నారు. గట్టిగా అరిస్తే పోయే బాధా తనది..? అది చేతకాని తనం కాదు.. అందుకు గొప్ప మనసుండాలి’అని ఆనందరావు అనడంతో.. అవును నాన్న.. మరీ చెప్పింది నిజం.. నేనే దీపకు నిజం చెప్పేస్తా అంటాడు కార్తీక్..
Karthika Deepam Nov 20 Today Episode-1
గుడి నుంచి పిల్లలను రెస్టారెంట్ తీసుకుని వెళ్దాం కారు తిప్పమని వారణాసికి చెబుతుంది దీప.. పిల్లలు హ్యాపీగా డాడీ కూడా వస్తే బాగుండు కదా అమ్మా అనడంతో.. మీ డాడీ బిజీగా ఉంటారు రాలేరమ్మా అంటుంది. ఇక రెస్టారెంటుకు వెళ్లాక ‘మీకు ఏం కావాలన్న తినండి.. మిమ్మల్ని ఆపను ఈరోజు ఆపను నేను అంటుంది దీప..ఇక నా నిర్ణయం మార్చుకోలేనని అంటుంది.
ఇంటిల్లిపాదికి షాక్.. పిల్లలే వచ్చారు, దీప ఎక్కడ..
రెస్టారెంట్ నుంచి పిల్లలు మాత్రమే ఇంటికి వస్తారు. దీప రాదు. దీంతో సౌందర్య, కార్తీక్ షాక్ అవుతారు. అమ్మ ఎక్కడ అని పిల్లలను అడుగగా ‘అమ్మ వెళ్లిపోయింది నాన్నమ్మా.. అమ్మమ్మ తాతయ్య వద్దకు వెళ్లింది. రేపు మిమ్మల్ని ఎక్కడికో రమ్మని చెప్పిందట కదా.. అక్కడి వస్తే అక్కడే కలుస్తానని చెప్పమంది అంటారు పిల్లలు.. వెంటనే దీపకు కాల్ చేయురా కార్తీక్ అనడంతో.. ఫోన్ ఆఫ్ వస్తుంది. దీంతో భయంతో వణికిపోతుంటారు దీప ఏం చేసుకుంటుందో అని… మరిన్ని వివరాలకు ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది.