Karthika Deepam nov 24 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీక దీపం’సీరియల్ ఎన్నో ట్విస్టుల మధ్య నడుస్తోంది. . బుధవారం నవంబర్ 24వ తేదీన ఈ సీరియల్ 1,205 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హైలెట్స్ ఇప్పుడు చూస్తేద్దాం..
మోనిత ఇంట్లో బారసాల ఫంక్షన్‌కు ‘దీప’వారణాసిని తీసుకుని వస్తుంది. ఇంట్లోకి వెళ్లి మోనితతో సంతోషంగా మాట్లాడుతూ చకచకా పనులన్నీ చూసుకుంటుంది. ఇంతలో కార్తీక్, ఆనందరావు, సౌందర్య కారులో వస్తారు. ఇంట్లోకి వెళ్లేందుకు కార్తీక్ ఇష్టపడకపోవడంతో.. సౌందర్య నేను వచ్చింది నా కోడలు దీప కోసం.. నువ్వు కూడా నాకోసం రా అనడంతో మెల్లిగా వెళ్తుంటాడు. అంతలోనే వారణాసిని చూసి దీప వచ్చిందా అని అడుగుతాడు.. అవును డాక్టర్ బాబు.. నాకు భయంగా ఉంది.. దీపక్కా వెళ్లిపోతుందేమో అనకుని భయపడుతూ ఉంటాడు.. నేను చూసుకుంటాను ఎక్కడకు వెళ్లకుండా అని కార్తీక్ చెబుతాడు.
దీపా అని గట్టిగా అరిచిన కార్తీక్..
కార్తీక్ లోనికి వచ్చేసరికి మోనిత సంబురంగా మెట్లపై నుంచి కిందకు దిగుతుంటుంది. కావాలనే దీపక్కా దీపక్కా అని పిలుస్తుంది. వంటింట్లో నుంచి జల్లి గంటేతో దీప వచ్చి వంటల గురించి మోనితతో మాట్లాడుతుండగా.. దీపా అని గట్టిగా అరుస్తాడు కార్తీక్.. ఆమె చేతిలో ఉన్న గరిటే విసిరేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్.. పిచ్చిలేసిందా నీకు అని భార్యను మందలిస్తాడు. ఇంతలో మోనిత వంటలక్క వంటలు చేస్తే తప్పులేదు కదా అని వెటకారం చేయడంతో సీరియస్ అవుతాడు కార్తీక్..
Karthika Deepam nov 24 Episode-2
ఇంతలో పంతులు అమ్మా.. బాబు పేరును అతని చెవిలో చెప్పండి అనడంతో ‘ఆనందరావు’అని బాబు చెవిలో చెబుతుంది మోనిత..ఆమె మెడలో తాళిబొట్టు కనిపించడంతో ఆనందరావు ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇక ఇక్కడి నుంచి కథ అడ్డతిరుగుతుంది.
మోనిత ఫ్యూజులు ఎగరగొట్టిన దీప..
పంతులు గారు బాబు తండ్రిని రావాలని చెప్పగా, దీప ఎంటరై మేము నీకు ఎమవుతామో అందరికీ చెప్పాలని పట్టుబడుతుంది. నేను నీకు ఎలా అక్కను చెప్పు అనడంతో కార్తీక్.. దీప భుజంపై చేయి వేసి ఈమెనే నా భార్య.. అర్థాంగి, నా సర్వస్వం అనడంతో మోనితతో పాటు అతిథులు కూడా షాక్ అవుతారు. మరి ఈమె ఏమవుతుందని అంతా అనుకుంటుంటారు.
దీప రంగంలోకి దిగి జరిగిన కథంతా చెబుతుంది. సహజ గర్బం అని అబద్ధం చెప్పి శాంపిల్స్ మాయం చేయడాలు, బ్లాక్ మెయిల్ చేసి సంతకం పెట్టించుకోవడాల గురించి అతిథుల ముందే మోనిత పాపాల చిట్టా విప్పుతుంది దీప.. అసలు ట్విస్ట్ రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సి ఉంటుంది. అప్పటివరకు ‘కార్తీకదీపం’కొనసాగుతోంది.