Karthika Deepam nov 25 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీకదీపం’ సీరియల్ చాలా ఆసక్తిగా సాగుతోంది. నవంబర్ 25వ తేదీన ఈ సీరియల్ 1206 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హైలెట్స్ ఇప్పుడు చూద్దాం..
ముప్పై రూపాయల తాళికట్టుకుంటే అది పెళ్లి ఎలా అవుతుందని పంతులు గారిని అడుగుతుంది దీపా.. అబద్దాలు చెప్పడం, ల్యాబ్ నుంచి ‘శాంపిల్స్’కొట్టేయడం, ప్రపంచానికి నీది సహజగర్భం అని నమ్మించడం వరకు అన్ని అబద్ధాలే అని ‘దీప’అనడంతో కార్తీక్, సౌందర్య షాక్ అవుతారు.
నోరు మూయ్ మోనిత అంటూ..
అతిథుల ముందే మోనిత నిజస్వరూపం బయటపెడుతుండగా.. ఎంటీ దీపక్కా నా గురించి అబద్దాలు చెబుతున్నావ్ అనడంతో నోరు మూయ్ మోనిత అంటూ దీప చేయి లేపుతుంది. ఒక్కొక్కటిగా మోనిత చేసిన దుర్మార్గాలను అందరికీ వివరిస్తుంది. డాక్టర్ బాబు ఓ రోజు తాగొచ్చి.. తప్పు చేయడం వల్లే నేను గర్భం దాల్చాను అంటుండగా.. దీపకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. డాక్టర్ బాబు మీద నిందలు వేస్తే ఊరుకునేది లేదంటూ ఫైర్ అవుతుంది.నువ్వు బారసాలకు పిలిస్తే తినిపోవడానికి వచ్చాము అనుకున్నావా..? నాలుగు కన్నీళ్ల కార్చి బస్తీకి పోయేదాన్ని కాదు.. ఇప్పుడే నీ నిజస్వరూపం బయటపెడతానని ప్రియమణిని బ్యాగు తీసుకుని రా అంటుంది.
Karthika Deepam nov 25 episode
మోనిత చెంప చెల్లుమనిపించిన సౌందర్య..
ప్రియమణి బ్యాగ్ తేవడంతో అందులోని కాగితాలను తీసి మోనితకు చూపిస్తుంది దీప. ‘ఇదేంటో తెలుసా..? ల్యాబ్ నుంచి నీకు దొంగతనంగా శాంపిల్ ఇచ్చినట్లు యాజమాని రాజారాం రాసి ఇచ్చిన స్టేట్మెంట్..’ అంటూ మొహంపై విసిరేస్తుంది. అది‘అబద్దం అంటూ మోనిత కంగారు పడుతుండగా.. ఏకంగా మొబైల్‌లో రాజారాం చెప్పిన స్టేట్మెంట్ ఉంటుంది. మోనితది సహజ గర్భం కాదనడానికి ఇదే సాక్ష్యం అంటూ వీడియో చూపిస్తుంది దీప.. అందలో ‘నా పేరు రాజారాం.. మాతృశ్రీ ల్యాబ్ ఓనర్ నేను.. మోనిత తనకు లక్షలు ఇస్తానని చెప్పడంతో డాక్టర్ కార్తీక్ శాంపిల్స్‌ను ఆవిడకు ఇచ్చాను. అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మోనిత దెబ్బకు చెమటలు తుడుచుకుంటుంది.
ఎలాగు అంతా బయటపడటంతో మోనిత.. ఇంతటితో సినిమా అయిపోలేదు దీపక్కా.. నా ప్రేమ అనంతం, నేను ఏం చేస్తానో చూడు అని కోపంగా దీపకు వార్నింగ్ ఇస్తుండగా.. వెంటనే సౌందర్య ‘నోరుముయ్’అంటూ వెళ్లి చెంప చెల్లుమనిపిస్తుంది. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దీపను ముద్దాడి అక్కడి నుంచి అంతా వెళ్లిపోతారు. సీన్ కట్ చేస్తే కార్తీక్, దీప కలిసిపోతారు. మనసు విప్పి మాట్లాడుకుంటారు. సౌందర్య, ఆనందరావు తన కోడలుని మెచ్చుకుంటారు. ఇక మోనిత లాయర్ ద్వారా దీప కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కొత్త వ్యూహాలు పన్నుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది.