Karthika Deepam Nov 26 Today Episode : లాయర్‌తో మోనిత ప్లాన్.. అది విన్న ప్రియమణి షాక్..

Karthika Deepam Nov 26 Today Episode : స్టార్ మా ప్రేక్షకులను ఇష్టమైన సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి. విభిన్న కథలో మలుపులతో కొనసాగుతున్న ఈ సీరియల్స్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. మరి ఈ రోజు (నవంబర్ 26, 2021)న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దామా? ఇంట్లో పొడుపు కథల పోటీలు పెట్టుకుంటారు. ఇందులో కార్తీక్, ఆదిత్య ఒకటీంగా కాగా, శ్రావ్య, దీప మరో టీం. అదే టైంలో అందరూ […].

By: jyothi

Updated On - Fri - 26 November 21

Karthika Deepam Nov 26 Today Episode : లాయర్‌తో మోనిత ప్లాన్.. అది విన్న ప్రియమణి షాక్..

Karthika Deepam Nov 26 Today Episode : స్టార్ మా ప్రేక్షకులను ఇష్టమైన సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి. విభిన్న కథలో మలుపులతో కొనసాగుతున్న ఈ సీరియల్స్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. మరి ఈ రోజు (నవంబర్ 26, 2021)న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దామా?


ఇంట్లో పొడుపు కథల పోటీలు పెట్టుకుంటారు. ఇందులో కార్తీక్, ఆదిత్య ఒకటీంగా కాగా, శ్రావ్య, దీప మరో టీం. అదే టైంలో అందరూ సెల్పీలు తీసుకుని హ్యాపీగా ఉంటారు. తర్వాత సీన్‌లో లాయర్ సురేష్‌, మోనిత మాట్లాడుకుంటుంటారు. ప్రతి ప్రాబ్లమ్స్‌కు ఓ సొల్యూషన్ ఉంటుందని దాని దిశగా మనం ఆలోచించాలని అని చెబుతాడు లాయర్. మీరు దిశలో వెళ్తారో నాకు తెలియదు కానీ ఎన్ని డబ్బులు ఖర్చయినా అనుకున్న ప్లాన్ జరిగితీరాలి అంటు చెబుతుంది మోనిత.


మీకేం కావాలని అన్న ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. నా రివేంజ్ ను మీరు తీర్చాలని చెబుతుంది. నేను ఎలాగైనా గెలిచితీరాలి. మీరే ఏదోటి చేయండి అంటూ లాయర్ కు చెబుతుంది మోనిత. డబ్బులు మీ అకౌంట్ లోకి వేస్తాను మనం అనుకున్న పని 2 వారాల్లో పూర్తి కావాలి అంటూ లాయర్ కు చెబుతుంది. ఓకే మేడం అంతా నేను చూసుకుంటాను.. కానీ మరొక పని చేయాల్సి ఉంటుంది. అంటూ ఓ ప్లాన్ చెబుతాడు లాయర్. అనంతరం లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. డైలాగులు కొట్టి గెలిచానని సంబరపడుతున్నావా దీపక్కా… గెలుపు అంటే ఎలా ఉంటుందో చూపిస్తా… నీకు నిద్ర లేకుండా చేస్తా.. నవ్వుకు నిన్ను శాశ్వతంగా దూరం చేస్తా అంటూ తనలో తానే మోనిత అనుకుంటుంది.

Karthika Deepam Nov 26 Today Episode

Karthika Deepam Nov 26 Today Episode

తర్వాతి సీన్ లో ఆదిత్య, పిల్లలంతా డాన్స్ చేస్తుంటారు. అనంతరం కార్తీక్, దీప ప్రైవేట్ గా మాట్లాడుకుంటారు. కార్తీక్.. దీప కళ్లు మూసి ఆమెకు మహాప్రస్థానం పుస్తకాన్ని గిప్ట్ గా ఇస్తాడు. దీంతో దీప చాలా సంతోష పడుతుంది. అనంతరం కార్తీక్, దీప హ్యాపీగా మాట్లాడుకుంటారు. అదే టైంలో బస్తీలో హెల్త్‌కు సంబంధించిన క్యాంపు పెడతామని కార్తీక్ అంటాడు. నెక్ట్ డే మార్నింగ్ లాయర్ కు కాల్ చేస్తుంది మోనిత. ఎలాగైనా గెలుస్తాం కదా.


ఇంతకాలం నుంచి ఎదురుచూస్తున్నది అందుకోసమే. అంటూ చెబుతుంది మోనిత. నేను చెప్పింది మాత్రం మీరు చేయండి అంటూ చెబుతాడు లాయర్. ఈ మాటలు విన్న ప్రియమణి షాకవుతుంది. ఇది గమనించి మోనిత.. ఏంటి దాక్కుని వింటున్నావా? అంటూ ప్రియమణిని అడుగుతుంది. ఇక కార్తీక్ ఇంటికి పోదాం పదా అంటుంది.

Tags

Latest News

Related News