karthika deepam nov 29 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీక దీపం’ సీరియల్ చాలా ఆసక్తిగా సాగుతోంది. నవంబర్ 29వ తేదిన ఈ సీరియల్ 1209 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ భాగంలోని హైలెట్స్ ఇప్పుడు చూద్దాం..
వంటలక్క ఉన్న బస్తీలో డాక్టర్ బాబు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తుంటే అక్కడకు బాబుతో సహా వస్తుంది మోనిత.. అక్కడ రచ్చ చేయాలని చూస్తే దీప రివల్స్ అటాక్ చేస్తుంది. అక్కడి ఆడవాళ్లను రెచ్చగొట్టగా వారంతా కర్రలు, చీపుర్లతో మోనిత పైకి దాడికి వస్తారు. దాంతో పక్కనే ఉన్న ప్రియమణి మోనితను ఆపి కారులో తీసుకెళ్తుంది. కారులో ఎక్కుతూ నన్ను ఇంతగా అనుమానిస్తారా.? నేను ఎంటో చూపిస్తానని మోనిత కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీప స్వయంగా వచ్చి నన్ను సారీ అడిగేలా చేస్తానంటూ కార్తీక్‌ను హెచ్చరిస్తుంది.
పిల్లలపై సీరియస్ అయిన ఆదిత్య..
ఇక పిల్లలు వచ్చి ఇంట్లో వారంతా ఎక్కడకు వెళ్ళారని అడగడంతో ‘బస్తీకి వెళ్లారని ఆదిత్య అంటాడు. దాంతో పిల్లలు బస్తీకి వెళ్లారా? మాకు చెబితే మేము కూడా వెళ్లే వాళ్లం కదా..? బస్తీ అంటే మాకు కూడా చాలా ఇష్టం.. అక్కడే ఉండిపోవాలని ఉంటుంది అనడంతో ఆదిత్య సీరియస్ అవుతాడు.. ఏంటీ ఆ మాటలు ఇంకెప్పుడు అలా మాట్లాడకండని పిల్లలకు చెబుతాడు ఆదిత్య..
karthika deepam nov 29 episode
ఏంటమ్మ అంతలా అవమానం జరిగితే ఇలా తాపీగా కూర్చుని తింటున్నారని అడిగితే.. దెబ్బ తగిలితే నేను ఇంకా స్పీడ్‌గా పరుగుతీస్తానంటూ ఓ పంచ్ డైలాగ్ ఇస్తుంది. రేపటి నుంచి ఆ ఇంట్లో వారిని ప్రశాంతంగా ఉండనివ్వను. కేకలు పెట్టిస్తాను అంటూ డైలాగ్స్ కొడుతుంది ప్రియమణితో. ఇకపోతే ‘దీప, కార్తీక్ వంట చేస్తుంటారు. పచ్చి మిర్చి కట్ చేసిన చేతులతో సౌందర్య మొహాన్ని ముట్టుకుంటాడు కార్తీక్. దీంతో సౌందర్య అరుస్తుంది. ఇకపోతే బస్తీలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉందామని డాక్టర్ బాబు దీపకు ప్రామిస్ చేస్తాడు.
మోనితకు డాక్టర్ పదవి పోనుందా?
కమింగ్ అప్‌లో.. డాక్టర్ బాబుకు డాక్టర్స్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వడానికి అంతా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అందుకోసం సమావేశం పెడితే భారతి, దీప అంతా కార్తీక్ గురించి మంచిగా చెబుతుంటారు. అదే సమయంలో మోనిత వచ్చి.. ‘నాకు అన్యాయం చేసిన డాక్టర్ బాబుకు ఈ పదవి ఇవ్వద్దని మాట్లాడుతుంది. వెంటనే దీప స్టేజ్ మీదే మోనితను ఉతికారేస్తుంది.
‘ఈ మోనిత డాక్టర్ వృత్తికే కలంకం’ అంటూ ఆమె తప్పుల చిట్టా విప్పబోతుంటుంది. దీంతో డాక్టర్ జాబ్ కూడా పోయే పరిస్థితి మోనితకు వచ్చేలా కనిపిస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘కార్తీక దీపం’ కొనసాగుతుంది.