Karthika Deepam nov 5th episode : బరితెగించిన ప్రియమణి.. మమ్మల్నే మోసం చేస్తావా అంటూ ‘వంటలక్క’ఉగ్రరూపం

Karthika Deepam nov 5th episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ చాలా ఆసక్తిగా సాగుతోంది. డాక్టర్ బాబు ఇంట్లో ఎలా సెటిల్ అవ్వాలని మోనిత్ ప్లాన్ చేస్తుండగా, సౌందర్య కార్తీక్‌ను ఒప్పించి మోనితతో పూజలో కూర్చోబెట్టాలని నానా తంటాలు పడుతుంది. అంతలో ప్రియమణి మోనిత ప్లాన్ తెలిసి వంటలక్క ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొడుతుంది. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ నవంబర్ 5 వ తేదీతో 1189 ఎపిసోడ్‌ లోకి ఎంటర్ అవ్వగా […].

By: jyothi

Published Date - Fri - 5 November 21

Karthika Deepam nov 5th episode : బరితెగించిన ప్రియమణి.. మమ్మల్నే మోసం చేస్తావా అంటూ ‘వంటలక్క’ఉగ్రరూపం

Karthika Deepam nov 5th episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ చాలా ఆసక్తిగా సాగుతోంది. డాక్టర్ బాబు ఇంట్లో ఎలా సెటిల్ అవ్వాలని మోనిత్ ప్లాన్ చేస్తుండగా, సౌందర్య కార్తీక్‌ను ఒప్పించి మోనితతో పూజలో కూర్చోబెట్టాలని నానా తంటాలు పడుతుంది. అంతలో ప్రియమణి మోనిత ప్లాన్ తెలిసి వంటలక్క ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొడుతుంది. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ నవంబర్ 5 వ తేదీతో 1189 ఎపిసోడ్‌ లోకి ఎంటర్ అవ్వగా హైలెట్స్ ఇప్పుడు చూద్దాం..

మోనిత.. ప్రియమణితో మాట్లాడుతూ త్వరలోనే నేను కార్తీక్ ఇంట్లో సెటిల్ అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. అప్పటిలోగానే నేను నా అందాన్ని పెంచుకోవాలి. అందుకోసం కొన్ని ఐటెమ్స్ తెచ్చి ఇవ్వాలని ప్రియమణిని కోరుతుంది. అంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. మోనిత వచ్చి చూడగా భారతి కనిపిస్తుంది. మోనితా.. రేపు శాంతి పూజకు మీ అత్తయ్య నిన్ను బాబుని తీసుకుని రావాలని చెప్పారని అనడంతో మోనిత ఏమీ విననట్టుగా యాక్టింగ్ చేస్తుంది. భారతి రెండు సార్లు చెప్పినా మోనిత అలాగే నటించడంతో భారతికి కోపం వచ్చి ఎంటి మోనిత ఇలా చేస్తున్నావు అంటుంది. మోనిత కోపంగా.. మా అత్తగారే నన్ను స్వయంగా వచ్చి పిలువచ్చుగా మధ్యలో నీ రాయభారం ఎందుకు.. ఏం చేయాలో నాకు తెలుసు నేను చూసుకుంటా నువ్వు వెళ్లు అనేస్తుంది భారతితో మోనిత..

కార్తీక్‌ను ఒప్పించేందుకు సౌందర్య అగచాట్లు..

కార్తీక్ నా మాట కాదు అనకురా.. అంటుంది సౌందర్య.. మమ్మీ నేను నీ హ్యాపీ కోసం ఏదైనా చేస్తాను కానీ ఆ మోనిత పక్కన కూర్చోను అని అంటాడు కార్తీక్. ఆ తర్వాత దేవుడి గది వద్దకు లాక్కెళ్లి.. మమ్మీ దేవుడు మీద ఒట్టు వేయమన్నా వేస్తా.. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆ మోనిత చెప్పిందంతా అబద్ధం అని అంటాడు కార్తీక్. కనీసం నా మనశ్శాంతి కోసం పూజలో కూర్చోరా అంటుంది సౌందర్య. సరిగ్గా దీప అప్పుడే వచ్చి ‘ఏంటి అత్తయ్యా.. శాంతి, మనశ్శాంతి అని మాట్లాడున్నారు అనడంతో సౌందర్య, కార్తీక్ నోటి వెంట మాట రాదు. దీంతో సౌందర్య మాట మార్చి అదేంలేదు దీప.. పూజ గది శుభ్రం చేద్దామని అనుకుంటున్నాం.. రేపు మంచి రోజు కదా అని మాట మారుస్తుంది.

Karthika Deepam nov 5th episode-2

Karthika Deepam nov 5th episode-2

వంటలక్క ఉగ్రరూపం.. ప్రియమణి ఔట్

ప్రియమణి వెనుక డోర్ నుంచి మెల్లిగా ఇంట్లోకి వస్తుండగా దీప కోపంగా చూస్తుంది. ఎక్కడికి వెళ్లావ్ అనడంతో ప్రియమణి మనసులో ఎలాగు మోనిత ఇంటికి వెళ్లిపోదాం అని డిసైడ్ అయ్యానుగా.. దీపకు నిజం చెప్పేద్దామని అనుకుంటుంది. మోనితను కలిసి వస్తున్నానని.. ఆమె జైల్లో ఉన్నప్పుడు కూడా కలిసేదాన్ని అనడంతో దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది.

ఇన్ని రోజులు ఇక్కడి విషయాలు అక్కడకు మోసింది నువ్వేనా అని ఆగ్రహించి దీప కోపంగా నడు బయటకు.. నువ్వు వెళ్తావా లేదా డాక్టర్ బాబును పిలువలా అని గట్టిగా అనడంతో ప్రియమణి కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.ఇక సౌందర్యకు ఫోన్ రాగా మాట్లాడుతున్న సమయంలో.. హిమ కార్తీక్ వద్దకు వచ్చి గదిలోకి తీసుకెళ్తుంది.నాకు ఒక ప్రామీస్ చేయు డాడీ అని అడగుంది. ఎంటమ్మా అని కార్తీక్ అనడంతో నువ్వు నేను సౌర్య, అమ్మ అందరం కలిసి ఈ గదిలోనే ఉందాం అని అనడంతో ఆలోచిస్తుంటాడు కార్తీక్.. దీప అందుకు ఒకే చెబుతుందా అని అడుగుతాడు హిమను.. మీరు మాతో ఎన్నడూ హ్యపీగా లేరు. ఇకనుంచి కలిసి ఉందాం. మాటిచ్చారు డాడీ మర్చిపోవద్దు అని హిమ అనడంతో కార్తీక్ తన కూతురిని దగ్గరకు తీసుకుంటాడు.. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే కార్తీకదీపం కొనసాగుతోంది.

Tags

Related News