karthika deepam Nov 6 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ ఎంతో ఆసక్తిని రేపుతోంది. నవంబర్ 6వ తేదీన 1,190 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సీరియల్ హైలెట్స్ ఇప్పుడు చూద్దాం.. సౌందర్య హడావిడిగా కారు దగ్గరకు వెళ్లి భారతికి కాల్ చేస్తుంది. అక్కడికే వెళ్తున్నానంటూ మాట్లాడుతుండగా దీప పై నుంచి మొత్తం వింటుంది.
అత్తయ్య ఎందుకు ఇలా మారిపోయారు. డాక్టర్ బాబు, అత్తయ్య కలిసి నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నారని ఎంతో బాధపడుతుంది. ఇంతలో సౌర్య దీప చెయ్యి పట్టుకుని డాక్టర్ బాబు గదిలోకి లాక్కెళ్తుంది. మాకు కథలు చెప్పమ్మా అంటూ పిల్లలిద్దరూ దీపను బతిలిలాడి అక్కడే పడుకునేలా చేస్తారు. డాక్టర్ బాబు ఎందుకు ఇలా మారిపోయారని దీప మనసులో అనుకుంటుండగా.. ‘దీప నేను మారలేదు.. పరిస్థితులే నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించాయని’ లోలోపల మదన పడుతుంటాడు కార్తీక్..
సాందర్యతో మోనిత వెటకారం..
మోనిత ఇంటికి వెళ్లి సౌందర్య తలుపు కొట్టగా ప్రియమణి డోర్ తీస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని కోపంగా అడుగగా.. దీపమ్మ నన్ను ఇంట్లోంచి పంపించివేసిందని చెప్పగా.. నువ్వు ఏం చేయకుండా దీప ఎందుకు వెళ్లిపోమంటుంది? అని సౌందర్య సీరియస్ అవుతుంది. ఇంతలో మోనిత వచ్చి ఆంటీ మీరా… దారి తప్పి మా ఇంటికి వచ్చారా అంటూ వెటకారం చేస్తుంది.
karthika deepam Nov 6 episode-2
భారతి నీకు అన్ని చెప్పిందిగా.. నాటకాలు చేయకు.. రేపు పూజకు పిలుద్దామని వచ్చా అని చెబుతుంది. నేను రాను అంటే? అని మోనిత అనడంతో ‘నువ్వు రేపు కచ్చితంగా రావాలి. నేను ఈ పూజ చేయిస్తున్నది నా కొడుకు, కోడలు సంతోషంగా ఉండేందుకు అని అంటుంది. ప్రియమణి మోనిత దగ్గరకు వచ్చి అదేంటమ్మా.. నా చేత మీ అత్తకు అబద్ధం చెప్పించి రేపు పూజకు వెళ్లను అంటున్నారని అడుగుతుంది.
మనకు టైం వచ్చినపుడు మనమెంటో కూడా చూపించాలని అంటూనే మోనిత భారతికి కాల్ చేసి పూజకు వస్తానని చెప్పు అంటుంది. కన్నింగ్ నవ్వుతో రేపు వాళ్లకి ఇస్తాను చూడు, ఊహించని ట్విస్ట్ అంటుంది మోనిత.. కార్తీక్‌తో పాటు పూజలో కూర్చున్నప్పుడు మీడియాను పిలిచి నానా రభసా చేయించి.. ఈ బాబు కార్తీక్ కొడుకు అని ప్రచారం చేయించి వాళ్లింటికి వెళ్లేందుకు మోనిత ప్లాన్ చేసిందేమో అని అందరికీ అనుమానం వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే కొనసాగుతోంది.