• Telugu News
  • movies

Karthika Deepam Nov 8th epiosode : ప్రియమణి గావుకేకలు.. టెన్షన్‌లో కార్తీక్, సౌందర్య ఏం చేశారంటే..?

Karthika Deepam Nov 8th epiosode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న‘కార్తీక దీపం’సీరియల్ నవంబర్ 8వ తేదిన 1,191 ఎపిసోడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎపిసోడ్‌లో మోనిత తన మెడలోని తాళిని చూసుకుంటూ మురిసిపోగా, ప్రియమణి గావుకేకలు పెడుతుంది. ఇక టెంపుల్ వెళ్లేందుకు సౌందర్య, కార్తీక్ టెన్షన్ పడుతుంటారు. ఇందులోని ప్రధాన సన్నివేశాలను ఇప్పుడు చూసేద్దాం.. సౌందర్యను కోప్పడ్డ ఆనందరావు.. సౌందర్య నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతున్నదా.. మోనిత కార్తీక్ జంటగా శాంతి […].

By: jyothi

Published Date - Mon - 8 November 21

Karthika Deepam Nov 8th epiosode : ప్రియమణి గావుకేకలు.. టెన్షన్‌లో కార్తీక్, సౌందర్య ఏం చేశారంటే..?

Karthika Deepam Nov 8th epiosode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న‘కార్తీక దీపం’సీరియల్ నవంబర్ 8వ తేదిన 1,191 ఎపిసోడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎపిసోడ్‌లో మోనిత తన మెడలోని తాళిని చూసుకుంటూ మురిసిపోగా, ప్రియమణి గావుకేకలు పెడుతుంది. ఇక టెంపుల్ వెళ్లేందుకు సౌందర్య, కార్తీక్ టెన్షన్ పడుతుంటారు. ఇందులోని ప్రధాన సన్నివేశాలను ఇప్పుడు చూసేద్దాం..

సౌందర్యను కోప్పడ్డ ఆనందరావు..

సౌందర్య నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతున్నదా.. మోనిత కార్తీక్ జంటగా శాంతి పూజ చేయడం ఏంటీ..? ఈ విషయం తెలిస్తే దీప ఎంత బాధపడుతుందో ఆలోచించావా అంటూ కోపం తెచ్చుకుంటాడు ఆనందరావు. ఇదంతా ‘నా కొడుకు, కోడలు దీప కోసమే చేస్తున్నానని సౌందర్య తన భర్తకు చెప్పి కార్తీక్ గది వద్దకు వెళ్తుంది. పిల్లలను నిద్రలేపుతూ ఈరోజైనా స్కూల్‌కు వెళ్తారా లేదా అంటూ వారిపై సీరియస్ అవుతుంది దీప.. ఆన్ లైన్ క్లాసులే కదా అమ్మా.. వెళ్తాములే అని హిమ, సౌర్య బదులిస్తారు.

ఆ తర్వాత సౌందర్య కార్తీక్ వద్దకు వెళ్లి త్వరగా రెడీ అవ్వురా వెళ్దాం అనడంతో అందుకు ఒప్పుకోడు డాక్టర్ బాబు. ఆ గండమెదో నాకే అనుకోని.. ఈ ఒక్కసారి నాకోసం పూజ చేయురా అనడంతో కార్తీక్ రెడీ అయ్యేందుకు వెళతాడు. మరోవైపు మోనిత సిద్ధం అవుతూనే తమ మెడలోకి తాళిబొట్టును చూసి తెగ మురిసిపోతుంటుంది. ఇకపై మనమే కథ మొత్తం నడిపించబోతున్నామని ప్రియమణితో అంటుంది మోనిత.. బాబును రెడీ చేయు అని చెప్పి తాళిబొట్టును పట్టుకుని చూస్తుండగా.. ప్రియమణి అమ్మగారూ అంటూ గట్టిగా అరుస్తుంది.

Karthika Deepam Nov 8th epiosode-2

Karthika Deepam Nov 8th epiosode-2

ఆ రోజే కార్తీక్‌తో నా పెళ్లి జరిగిపోయింది..

ఏమైంది ప్రియమణి ఎందుకా గావుకేక పెట్టావు. తాళి వేసుకున్నాననా? కార్తీక్‌ పక్కన భార్యస్థానంలో కూర్చోబోతున్నానను. నా బుల్లి ఆనందావు కూడా ఉన్నాడు. ఇది ఒక్కటే తక్కువైందని వేసుకున్నానని చెబుతుంది మోనిత.. ప్రియమణి షాక్ అవుతూనే.. కార్తీక్ అయ్యతో తాళి కట్టించుకుంటే బాగుండు కదమ్మా అనే సరికి.. ఆ రోజు నా భర్త స్థానంలో కార్తీక్ సంతకం పెట్టినప్పుడే మా పెళ్లి జరిగిపోయింది ప్రియమణి.. ఇప్పుడు తాళి నేను వేసుకుంటే పెద్ద తప్పేం కాదంటూ మురిసిపోతుంది మోనిత..

దీప పిల్లలను స్కూల్‌ కోసం రెడీ చేస్తూ విసుక్కుంటుంది. ఆ తర్వాత ఆనందరావు దగ్గరకు వెళ్లి ‘మావయ్య గారు డాక్టర్ బాబు, అత్తయ్య ఎక్కడికి వెళ్లారని అడగ్గా తెలీదమ్మా అని అబద్దం చెబుతాడు. మామయ్య చెప్పింది అబద్ధం అని తెలుసుకున్న దీప ఆలోచిస్తుంటుంది. సౌందర్యతో కలిసి పూజకు బయలుదేరిన కార్తీక్ దీప మాటలను, ఆమె చూపులను గుర్తుచేసుకుని ఒక్కసారిగా కారు ఆపుతాడు. మిగతాది తర్వాతి భాగంలో చూసేద్దాం..

Tags

Latest News

Related News