• Telugu News
  • movies

Karthika Deepam nov 9th episode : కార్తీకే తన భర్త అనడానికి సాక్ష్యాలన్నీ సిద్ధం చేసిన‌మోనిత.. ‘దీప’ఇక ఒంటరేనా..?

Karthika Deepam nov 9th episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ ఎన్నో ట్విస్టుల మధ్య సాగుతోంది. ప్రేక్షకులు కూడా ‘దీప’పరిస్థితి తలుచుకుని ఎంతో ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ -9న ఈ సీరియల్ 1,192 ఎపిసోడ్‌‌లోకి ఎంటరైంది. హైలెట్స్ ఇప్పుడు చూద్దాం.. నాతో కాదు మమ్మీ .. ఆ మోనిత పక్కనే కూర్చోని పూజ చేయలేనని కార్తీక్ అనడంతో సౌందర్య ‘రేయ్ దీపకు నువ్వు ఎంతో అన్యాయం చేశావు.. ఈ […].

By: jyothi

Published Date - Tue - 9 November 21

Karthika Deepam nov 9th episode : కార్తీకే తన భర్త అనడానికి సాక్ష్యాలన్నీ సిద్ధం చేసిన‌మోనిత.. ‘దీప’ఇక ఒంటరేనా..?

Karthika Deepam nov 9th episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ ఎన్నో ట్విస్టుల మధ్య సాగుతోంది. ప్రేక్షకులు కూడా ‘దీప’పరిస్థితి తలుచుకుని ఎంతో ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ -9న ఈ సీరియల్ 1,192 ఎపిసోడ్‌‌లోకి ఎంటరైంది. హైలెట్స్ ఇప్పుడు చూద్దాం..

నాతో కాదు మమ్మీ .. ఆ మోనిత పక్కనే కూర్చోని పూజ చేయలేనని కార్తీక్ అనడంతో సౌందర్య ‘రేయ్ దీపకు నువ్వు ఎంతో అన్యాయం చేశావు.. ఈ ఒక్క పూజ చేస్తే నువ్వు బాగుంటావు, ఆ తర్వాత దీపను సంతోషంగా ఉండొచ్చు.. నా మాట వినరా కార్తీక్ అంటుంది సౌందర్య. ఒకవేళ నువ్వు రాకపోతే కారు ఆపు.. నేనే తిరిగి వెనక్కి వెళ్లిపోతానని సౌందర్య అనడంతో కార్తీక్ ఏం మాట్లాడకుండా టెంపుల్‌‌కు పోనిస్తాడు.

నా విజయం మమూలుది కాదు ప్రియమణి..

ప్రియమణి ‘నా విజయం మామూలుది కాదు.. ది గ్రేట్ సౌందర్య అత్త నా ఇంటికి వచ్చి పూజకు పిలవడం ఏంటీ..? కార్తీక్‌తో కలిసి నేను పూజ చేయడం ఏంటీ? ఇవన్నీ కల లాగే అనిపిస్తున్నా నిజం కాబోతున్నాయి. అంతా ఈ బుల్లి ఆనందరావు వల్లే జరిగాయని మోనిత సంతోషపడుతుంటుంది. ఇక దీప.. వారణాసి కారులో ఏదో ఆలోచించుకుంటూ కార్తీక్, సౌందర్య తనకు తెలీకుండా ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి రెడీ అవుతుంది. అటు పోనీ, ఇటు పోనివ్వు అంటూ వారణాసి మీద సీరియస్ అవుతుంది.

Karthika Deepam nov 9th episode-2

Karthika Deepam nov 9th episode-2

ఇంతలో కార్తీక్ కారు టెంపుల్ ముందు ఆగుతుంది. ఒక్కసారి ఆలోచించు మమ్మీ అని కార్తీక్ అనడంతో బలవంతగా తన కొడుకును తీసుకెళ్లి రెడీ చేయిస్తుంది సౌందర్య. అప్పుడే మోనిత కారు రాగా, బాబుతో దిగి ప్రియమణికి చెవిలో ఏదో సీక్రెట్ చెబుతుంది. ఆ సన్నివేశం చూస్తే మీడియా లేదా చాటుగా ఫోటోలు తీయాలని, లేదా దీపకు కాల్ చేసి రమ్మని చెబుతుంది కావొచ్చు అనిపిస్తుంది.

కార్తీక్ తన భర్తే అనడానికి మోనిత వద్ద సాక్ష్యాలు..?

మోనిత రాగానే కార్తీక్‌ రా వెళ్లి కూర్చుందామని చేయి పట్టకోవడంతో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు డాక్టర్ బాబు. పూజలో ఇద్దరు కూర్చున్నాక మోనిత కార్తీక్ దగ్గరకు జరుగుతూ ఉంటుంది. తన మెడలో తాళి, పక్కనే కార్తీక్, బుల్లి ఆనందరావు, సాక్ష్యంగా పంతులు, ప్రియమణి చాటుగా ఫోటోస్ తీస్తే వాటిని పట్టుకుని మోనిత కోర్టుకు ఎక్కితే డాక్టర్ బాబు తన భర్తే అనడానికి మోనిత వద్ద అన్ని ఆధారాలు ఉన్నట్టే.. ఆపరేషన్ టైంలో కార్తీక్ పెట్టిన సంతకం కూడా మరో సాక్ష్యం. పైగా ప్రియమణితో కలిసి ఇంకెదో ప్లాన్ చేసింది మోనిత.. పాపం ఈ ఉపద్రవాన్ని దీప ఎలా ఎదుర్కొంటుందో అని టెన్షన్ టెన్షన్.. తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్‌లో చూడాలి.

Tags

Latest News

Related News