Karthika Deepam nov1st episode : కార్తీక దీపం స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్. ఈ సీరియల్ కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. నేడు ఈ సీరియల్ 1185 వ ఎపిసోడ్ జరగబోతుంది. 1185వ ఎపిసోడ్ లో ఏం జరగుతుందని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ్టి ఎపిసోడ్ లో దీప (వంటలక్క) ఎక్కడికి వెళ్లి ఉంటుందని అందరూ కంగారు పడతారు.
ఇంట్లో వాళ్లు ఈ విషయం గురించి మాట్లాడుకుంటుండగా… ప్రియమణి బయట నుంచి అంతా వినేస్తుంది. బయటకు వెళ్లిన సౌందర్యకు గుమ్మం వద్ద ప్రియమణి తారసపడుతుంది. దీంతో సౌందర్య ప్రియమణిని నీవు ఇక్కడేం చేస్తున్నావు అని గద్దిస్తుంది. దీంతో నీళ్లు నమిలిన ప్రియమణి.. అది మోనితమ్మ కాల్ చేసిందమ్మ అని చెబుతుంది. ఓహో అలాగా ఏం చెప్పింది అని సౌందర్య ప్రియమణిని అడుగుతుంది. మోనితమ్మకు పండంటి బాబు పుట్టాడంటగా.. కార్తిక్ బాబే సంతకం చేశాడని చెప్పినట్లు వివరిస్తుంది.
దీంతో కంగారు పడిన సౌందర్య ప్రియమణిని మెల్లగా మాట్లాడమని వారిస్తుంది. ఈ విషయం దీపకు చెప్పలేదు కదా అని ప్రశ్నిస్తుంది. దానికి ప్రియమణి ఇంకా చెప్పలేదని సమాధానం చెబుతుంది. అయినా దీపమ్మ కనిపించడం లేదని అందరూ కంగారు పడుతున్నారుగా అమ్మా అంటూ ప్రశ్నిస్తుంది. సరేలే వెళ్లు అని సౌందర్య అనడంతో ప్రియమణి అక్కడి నుంచి బయలుదేరుతుంది. రెండడుగులు ముందుకు వేసిన ప్రియమణి ఒక్క క్షణం ఆగి.. సౌందర్యతో అమ్మా బిడ్డ పేగు మెడలో వేసుకుని పుట్టాడంట. అలా పుడితే మేనమామకు కానీ కన్న తండ్రికి కానీ అరిష్టం శాంతి పూజలు చేయించాలమ్మా అని అంటుంది.
Karthika Deepam nov1st episode-2
పిల్లాడికి ఎలాగూ మేనమామలు లేరు కాబట్టి తండ్రి అయిన కార్తిక్ బాబుకే అపాయం అంటూ చెప్పుకొస్తుంది. ఈ విషయం విన్న సౌందర్య ప్రియమణిని ఇక్కడి నుంచి వెళ్లిపో అని అరుస్తుంది. ఇక ఇదిలా ఉండగా.. ప్రియమణి మోనితకు కాల్ చేసి అమ్మా మీరు చెప్పినట్లే చేశాను. సౌందర్య అమ్మ కంగారు పడింది. ఇంతకీ మీరు ఎప్పుడు వస్తారమ్మ అని అడుగుతుంది. దానికి మోనిత ఇవాళో, రేపో డిశ్చార్జి చేస్తారంట.. వస్తాను అనే సమాధానం చెబుతుంది. దీప ఇంట్లో లేదనే విషయాన్ని కూడా ప్రియమణి మోనితకు చెబుతుంది. ప్రియమణిని ఒక సారి కలవమని మోనిత ఆదేశిస్తుంది.
అదే సమయంలో దీప మాతృశ్రీ ల్యాబ్ కు వెళ్తుంది. ఆ ల్యాబ్ యజమానిని నిలదీస్తుంది. కానీ అతడు మేము శాంపిల్స్ ఎవరికీ ఇవ్వలేదని చెప్పడంతో అక్కడి నుంచి బయటకు వస్తుంది. పిల్లలు వచ్చి కార్తిక్ బాబును మీరు ఇంతకుముందులా ఎందుకు సంతోషంగా ఉండడం లేదని ప్రశ్నిస్తారు.