• Telugu News
  • movies

karthika deepam November 10th episode : కార్తీక్, మోనిత జంటగా గుడికి.. అత్తయ్యా మోసం చేస్తారా అంటూ ఏడ్చేసిన దీప‌

karthika deepam November 10th episode : బుల్లితెర ఆడియెన్స్‌ను టీవీల ముందే కట్టిపడేసేలా కార్తీక దీపం ఎపిసోడ్స్ సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘కార్తీకదీపం’ నవంబర్ 10న 1,193 ఎపిసోడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాని హైలెట్స్ ఇప్పుడు చూద్దాం. కార్తీక్,మోనితతో కలిసి పూజ చేస్తున్న టైంలో దీప వీరికోసం కారులో వెతుకుతూ ఉంటుంది. అదే టైంలో గుడి ముందుగా వారణాని కారు పోనిస్తుంటే దీప.. సౌందర్య కారును చూసి బండి ఆపమని చెబుతుంది.. నువ్వు వెళ్లిపో […].

By: jyothi

Published Date - Wed - 10 November 21

karthika deepam November 10th episode : కార్తీక్, మోనిత జంటగా గుడికి..  అత్తయ్యా మోసం చేస్తారా అంటూ ఏడ్చేసిన దీప‌

karthika deepam November 10th episode : బుల్లితెర ఆడియెన్స్‌ను టీవీల ముందే కట్టిపడేసేలా కార్తీక దీపం ఎపిసోడ్స్ సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘కార్తీకదీపం’ నవంబర్ 10న 1,193 ఎపిసోడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాని హైలెట్స్ ఇప్పుడు చూద్దాం. కార్తీక్,మోనితతో కలిసి పూజ చేస్తున్న టైంలో దీప వీరికోసం కారులో వెతుకుతూ ఉంటుంది.

అదే టైంలో గుడి ముందుగా వారణాని కారు పోనిస్తుంటే దీప.. సౌందర్య కారును చూసి బండి ఆపమని చెబుతుంది.. నువ్వు వెళ్లిపో నేను తర్వాత వస్తానని చెప్పడంతో.. వారణాసి నేను నీతోనే ఉంటానని వారణాసి అంటాడు. దీంతో వద్దు.. నేను చచ్చిపోను నువ్వు వెళ్లిపో అని కోపం తెచ్చుకుంటుంది దీప..

అత్తయ్యా మీరు కూడా నన్ను మోసం చేస్తారా..

గుడిలోకి వచ్చి దీప మొత్తం తిరుగుతూ కార్తీక్, సౌందర్య కోసం వెతుకుతుంది. వాళ్లు కనిపించకపోయే సరికి నేనే పొరబడ్డానని తిరిగి వెళ్తుండగా ఒక్కసారిగా కార్తీక్, మోనితలు జంటగా పూజ చేయడాన్ని చూసి షాక్ అవుతుంది. పక్కనే సౌందర్య దగ్గరుండి వారితో పూజ చేయడాన్ని గమనించిన దీప.. అత్తయ్యా మీరు కూడా నన్ను ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదని మనసులో కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది. ఆ రోజు సంతకం పెడితే మానవత్వం అనుకున్నాను.. కానీ, ఈ రోజు పక్కనే కూర్చుని పూజ చేస్తారా డాక్టర్ బాబు’అంటూ మనసులో బాధపడుతుంది.

karthika deepam November 10th episode-2

karthika deepam November 10th episode-2

కార్తీక్ బాబుని నూనెలో చూపించి తిరిగి పీటల మీద కూర్చుంటుండగా దీపను చూసి షాక్ అవుతాడు. అప్పుడే దీప వెనక్కి తిరిగి వెళ్తుంటుంది. దీపనా కదా అని మనసులో భయపడుతుంటాడు కార్తీక్.. ఇంతలోనే దీపకు మరో పంతులు కనిపించగా ఆ పూజ ఎందరు చేస్తున్నారని అడుగగా.. బాబు పేగు మెడలో వేసుకుని పుట్టాడమ్మా.. అందుకే ఆ భార్యాభర్తలు పూజ చేస్తున్నారని చెప్పడంతో దీప వెళ్లిపోతుంది.

మోనిత ఓవరాక్షన్.. కార్తీక్ సీరియస్

పూజ అయిపోయాక మోనిత ఓవరాక్షన్ చేస్తుంది. మా బాబుకి మా మావయ్య గారి పేరే పెట్టాము.. ఆనందరావు అని.. వీడిని ఎవరూ అరే తురే అని పిలవలేరు ఇక అనడంతో.. పూజారి సౌందర్యతో.. అమ్మా మీకు అనుకూలవతి అయిన కోడలు దొరికింది మీ అదృష్టం అని మెచ్చుకుంటాడు. ఈ మాటలు విని కార్తీక్ సీరియస్‌గా మేమే వెళ్లొచ్చా పంతులు గారు అనడంతో ఒక 5 నిమిషాలు కూర్చుని వెళ్లమని చెబుతాడు. ఇక మోనిత ‘ఏమండీ బాబుని చూడండి.. ఒకసారి ఎత్తుకోండి అంటూ ఓవరాక్షన్ చేస్తుండగా.. ఆపు మోనిత.. నీ పేరు పలకడానికి కూడా అసహ్యంగా ఉంది. పదా మమ్మీ వెళ్లిపోదాం అనడంతో.. మోనిత కార్తీక్ చేయి పట్టుకుని ఆపుతుంది.

Tags

Latest News

Related News