• Telugu News
  • movies

Karthika Deepam November 23 Episode : సౌందర్యను తెగ ఏడిపిస్తున్న మోనిత.. గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన దీప‌..

Karthika Deepam November 23 Episode : తెలుగు నాట స్టార్ మా చానళ్లో వచ్చే కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ నవంబర్ 23 తో 1204 వ ఎపిసోడ్ లోకి ఎంటరైంది. సీరియల్ హీరోయిన్ అయిన వంటలక్క అలియాస్ దీప తన తండ్రి ముందు నుల్చొని ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది నాన్నా అని అనగా.. నాకెందుకమ్మా ఈ డ్రెస్ లు అని తన తండ్రి మురళీకృష్ణ అంటాడు. తర్వాత […].

By: jyothi

Updated On - Tue - 23 November 21

Karthika Deepam November 23 Episode : సౌందర్యను తెగ ఏడిపిస్తున్న మోనిత.. గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన దీప‌..

Karthika Deepam November 23 Episode : తెలుగు నాట స్టార్ మా చానళ్లో వచ్చే కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ నవంబర్ 23 తో 1204 వ ఎపిసోడ్ లోకి ఎంటరైంది. సీరియల్ హీరోయిన్ అయిన వంటలక్క అలియాస్ దీప తన తండ్రి ముందు నుల్చొని ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది నాన్నా అని అనగా.. నాకెందుకమ్మా ఈ డ్రెస్ లు అని తన తండ్రి మురళీకృష్ణ అంటాడు. తర్వాత పండుక్కి ఒక్క దానివే వచ్చావేంటమ్మా అల్లుడు రాలేదని ఆరా తీస్తాడు.


మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా అని గాబరాపడతాడు. దానికి దీప బాగుండడం అంటే ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నాన్నా అని అంటుంది. బాగా ఉండటమా? బాగున్నట్లు యాక్ట్ చేయడమా? అని అంటూ మాట దాటేస్తుంది. అదేం లేదు నాన్నా అల్లుడు గారికి నాకు ఏం సమస్యలు లేవు. మోనిత సమస్య ఎప్పటికీ ఉండేదే కదా. అంటూ తన తండ్రిని తిందామని తీసుకుని వెళ్తుంది.


ఇక మోనిత విషయానికి వస్తే.. తను చాలా సంతోషంతో ఉబ్బి తబ్బిబవుతుంది. కార్తీక్ ను వశం చేసుకోబోతున్నానని కలలు కంటూ ఉంటుంది. ఇంటిని మొత్తం పూలతో డెకరేట్ చేయిస్తుంది. డెకరేట్ చేసేవారికి, మరియు ప్రియమణికి అలా చేయండి. అది ఇలా చేయండి అంటూ ఆర్డర్స్ వేస్తుంది. రేపు ఉదయానికల్లా పనులు మొత్తం అయిపోవాలి అంటుంది.

Karthika Deepam November 23 Episode -2

Karthika Deepam November 23 Episode -2

ఇంతలో భారతి వస్తుంది. దాంతో మోనిత భారతితో రా భారతి నువ్వే నా ఆత్మీయురాలివి అని అంటూ అంటుంది. ఇల్లంతా అలంకరించడం చూసిన భారతి అసలు ఏం జరుగుతుంది అని మోనితను ప్రశ్నిస్తుంది. దానికి మోనిత జూనియర్ ఆనందరావు బారసాల రేపు అంటూ సమాధానం చెబుతుంది. నా కింద చేసేవాళ్లని, కార్తిక్ కింద చేసేవాళ్లని ఫంక్షన్ కు పిలిచాను.


నువ్వూ రవి తప్పకుండా రావాలని చెబుతుంది. దీనికి ఆశ్చర్యపోయిన భారతి అసలు ఫంక్షన్ ఎలా జరుగుతుంది. కార్తిక్ ఎలా వస్తాడు అని అడుగుతుంది. వస్తారు. తప్పకుండా వస్తారు. సంతకం పెట్టలేదా.. పూజకి రాలేదా రేపు కూడా వస్తారు. అని మోనిత ఓవర్ కాన్ఫిడెన్స్ తో సమాధానం చెబుతుంది. నీవు మారవు అని భారతి తిట్టి వెళ్లిపోతుంది. ప్రియమణితో మోనిత రేపు బారసాల ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది కదా. అని అంటుంది. దానికి ప్రియమణి.. ఏమోనమ్మా నాకైతే అనుమానంగానే ఉంది అంటుంది. దాంతో మోనిత ప్రియమణిని నీవు భయపడి నన్ను భయపెట్టకు అని కోప్పడుతుంది.

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News