Karthika Deepam oct 28 Episode :నేనేం పాపం చేశానంటూ ఏడ్చేసిన దీప‌.. డాక్ట‌ర్ బాబు షాక్‌..

Karthika Deepam oct 28 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీకదీపం’ సీరియల్‌లోని ప్రస్తుత ఎపిసోడ్స్ ఎంతో ఆసక్తిగా సాగుతున్నాయి. వరస ట్విస్టులతో ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోంది. తాజాగా కార్తీకదీపం సీరియల్ 2021 అక్టోబర్ 28న 1,183 ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. మోనిత తనది కృత్రిమ గర్భం కాదని, సహజమైనదే అని.. కార్తీక్ ఆరోజు నువ్వు తాగిన మత్తులో ఉన్నావ్, అనుకోకుండా అలా అయిపోయిందని గత ఎపిసోడ్ మాటలను డాక్టర్ బాబు గుర్తుచేసుకుంటాడు. ఆ […].

By: jyothi

Published Date - Thu - 28 October 21

Karthika Deepam oct 28 Episode :నేనేం పాపం చేశానంటూ ఏడ్చేసిన దీప‌.. డాక్ట‌ర్ బాబు షాక్‌..

Karthika Deepam oct 28 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీకదీపం’ సీరియల్‌లోని ప్రస్తుత ఎపిసోడ్స్ ఎంతో ఆసక్తిగా సాగుతున్నాయి. వరస ట్విస్టులతో ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోంది. తాజాగా కార్తీకదీపం సీరియల్ 2021 అక్టోబర్ 28న 1,183 ఎపిసోడ్‌లోకి ఎంటరైంది.

మోనిత తనది కృత్రిమ గర్భం కాదని, సహజమైనదే అని.. కార్తీక్ ఆరోజు నువ్వు తాగిన మత్తులో ఉన్నావ్, అనుకోకుండా అలా అయిపోయిందని గత ఎపిసోడ్ మాటలను డాక్టర్ బాబు గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత సౌందర్యతో కలిసి ఆస్పత్రి నుంచి వెళ్లిపోదామనుకునే లోపు భారతి కార్తీక్ ను ఆపుతుంది. నువ్వు సంతకం పెట్టకపోతే మోనిత చనిపోతుంది కార్తీక్ ఇక ఇష్టం నేను వెళ్తున్నాను అని చెప్పి భారతి వెళ్తుండగా.. సౌందర్య తనను ఆపి ఆ పేపర్స్ తీసుకుని రమ్మంటుంది. ఎంటీ మమ్మీ ఇదంతా అంటూ కార్తీక్ అడగబోతుండగా.. సంతకం పెట్టాలని సౌందర్య చెబుతుంది. దీంతో కార్తీక్ తన మమ్మీ మాట కాదనలేక సైన్ చేస్తాడు. ఆ తర్వాత భారతి అపాస్మారక స్థితిలో ఉన్నా మోనితను లేపి చూడు కార్తీక్ సంతకం పెట్టాడు అనడంతో సంతోషిస్తుంది మోనిత..

మమ్మీ నాకేం అర్థం కావడం లేదని కార్తీక్ తలపట్టుకుని బాధపడుతుండగా.. మోనిత ఇన్నాళ్లు చెప్పింది అబద్ధమే కావొచ్చు. కానీ తన మాటల్లో నాకు ఈరోజు నిజం కనిపిస్తుందిరా అంటుంది సౌందర్య. అంటే ఎంటీ మమ్మీ మొన్న దీప, పిల్లలు.. ఇరుగుపొరుగుతో పాటు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని కార్తీక్ అడగబోతుండగా.. భారతి వచ్చి కంగ్రాట్స్ కార్తీక్.. పండంటి మగ బిడ్డ జన్మించాడు.. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమం అని చెబుతుంది.

Karthika Deepam oct 28 Episode-1

Karthika Deepam oct 28 Episode-1

సీన్ కట్ చేస్తే.. వంటలక్క మాత్రం ల్యాబ్‌లో పల్లవి చెప్పిన మాటలను వింటూ తెగ ఆలోచిస్తుంటుంది. పల్లవి నిజం చెబితే.. డాక్టర్ బాబు అబద్ధం చెప్పారా? అంటూ లోలోపల మదనపడుతుంటుంది. ఇంతలో హిమ, సౌర్య వచ్చి దీప వద్దకు వచ్చి ‘బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయా అమ్మా.. ఏమైంది అని అడుగుతారు.. అంతా ఓకే అంటుంది దీప..

ఈ విషయం దీపకు తెలియద్దు..

బిడ్డ పుట్టాడని తెలిసాక కార్తీక్ సౌందర్య ఇంటికి బయలు దేరుతారు. ఏం చేయాలి మమ్మీ ఈ గండం నుంచి ఎలా బయటపడాలి.. ఈ విషయం దీపకు తెలిస్తే ఎలా? అసలే తనకు ఆత్మాభిమానం ఎక్కువ. నన్ను ఎప్పిటికీ క్షమించదు అని కార్తీక్ అంటుండగానే.. ఈ విషయం ఎప్పటికీ దీపకు తెలియద్దు అని సౌందర్య చెబుతుంది. ఈ విషయం లీక్ కావొద్దని భారతికి కూడా స్ట్రాంగ్‌గా చెప్పానని అంటుంది. ఈశ్వరా ఏంటి ఈ పరీక్ష అనుకుంటూ సౌందర్య ఏదైనా టెంపుల్ దగ్గర కారు ఆపు కార్తీక్ అంటుంది. డాక్టర్ బాబు మోనిత ఆపరేషన్ కోసం సంతకం చేశారన్న విషయం ప్రియమణికి తెలుస్తుంది.

వెంటనే దీపను కలిసిన ప్రియమణి.. డాక్టర్ బాబు గురించి ఓ సంచలన విషయం తెలిసింది దీపమ్మా.. ఈ విషయం ఎవరికీ చెప్పద్దు అంటూనే అసలు విషయాన్ని దీపకు చెప్పేస్తుంది. మోనితమ్మకు పురిటి నొప్పులు వచ్చాయట.. బిడ్డ మెడకు పేగు చుట్టుకున్నదని.. డాక్టర్ బాబు వెళ్లి సంతకం చేయడంతో మోనితమ్మకు ఆపరేషన్ జరిగిందని మొత్తం వివరిస్తుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన దీప.. డాక్టర్ బాబు వెళ్లి సంతకం చేశారా..?’ అనుకుంటూ బాధతో వెళ్లిపోతుంది దీప.. ప్రియమణి మాత్రం దీప బాధను ఎంజాయ్ చేస్తుంటుంది.

టెంపుల్ నుంచి కార్తీక్, సౌందర్య ఇంటికి చేరుకునేలోపు ఆదిత్య, సౌర్య, హిమ, ఆనందరావు ఆడుకుంటూ ఆనందంగా గడుపుతుంటారు. సౌందర్య, కార్తీక్‌ను చూసిన పిల్లలు తండ్రిని కౌగిలించుకుంటారు ప్రేమగా.. సడన్‌గా గుడికి ఎందుకు వెళ్లారు మమ్మీ అని ఆదిత్య అడుగడంతో భక్తికి సమయం సందర్భం ఏముంటాయి ఆదిత్యా అంటుంది సౌందర్య.. దర్శనం బాగా అయ్యిందా? అని ప్రియమణి వెటకారం చేయగా.. హా బానే అయ్యిందని చెబుతూ సౌందర్య మెట్లు ఎక్కుతుండగా.. దీప సడెన్‌గా వచ్చి.. అత్తయ్యా అని పిలుస్తుంది.. కార్తీక్, సౌందర్యలు వెనక్కి చూడగా.. దీప ఏడుస్తూ నేను ఏం పాపం చేశాను అత్తయ్యా’ నాకే ఇలా ఎందుకు జరుగుతుందని అడుగడంతో డాక్టర్ బాబు, సౌందర్య షాక్ అవుతారు. మరిన్ని వివరాలకు కార్తీకదీపం తరువాయి భాగంలో చూద్దాం..

Tags

Latest News

Related News