• Telugu News
  • movies

Karthika Deepam October 23 Today episode : ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్‌.. పని మనిషి ఎంట్రీతో కథలో కీలక మలుపు

Karthika Deepam October 23 Today episode : బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్‌లో నెంబర్ వన్ సీరియల్ ‘కార్తీక దీపం’అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సీరియల్ టైం అయిందంటే చాలు ప్రజలు టీవీలకు అతుక్కుపోతుంటారు. తాజాగా ఈ సీరియల్ 1179వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయింది. శనివారం ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. Karthika Deepam October 23 Today episode : మోనిత ముందు నుంచే వెళ్లిపోయిన కార్తీక్.. డాక్టర్ బాబు కార్తీక్ […].

By: jyothi

Updated On - Sat - 23 October 21

Karthika Deepam October 23 Today episode : ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్‌.. పని మనిషి ఎంట్రీతో కథలో కీలక మలుపు

Karthika Deepam October 23 Today episode : బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్‌లో నెంబర్ వన్ సీరియల్ ‘కార్తీక దీపం’అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సీరియల్ టైం అయిందంటే చాలు ప్రజలు టీవీలకు అతుక్కుపోతుంటారు. తాజాగా ఈ సీరియల్ 1179వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయింది. శనివారం ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Karthika Deepam October 23 Today episode : మోనిత ముందు నుంచే వెళ్లిపోయిన కార్తీక్..

డాక్టర్ బాబు కార్తీక్ వద్దకు వచ్చి మోనిత బెదిరింపులకు దిగుతుంది. తాను కార్తీక్ శాంపిల్స్ దొంగతనం చేసి ప్రెగ్నెంట్ అయ్యానని, కార్తీక్ ఆ శాంపిల్స్‌ను తన వైఫ్ దీపపై అనుమానంతో ఇచ్చినవని అంటుంది. ఈ విషయాలన్నిటినీ తాను మీడియా ఎదుట చెప్తానని అప్పుడు నీ పిల్లలకు, భార్య, అమ్మకు ఏం సమాధానం చెప్తావ్? అంటూ కార్తీక్‌ను మోనిత అడుగుతుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భారతి మోనితను నిలువరించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు భారతిని మోనిత ఇది భార్యా భర్తల విషయం నీకు సంబంధం లేదు అని అంటుంది.

ఇక అమెరికాకు నువ్వు ఎలా వెళ్తావో చూస్తా అన్న రేంజ్‌లో మోనిత కార్తీక్‌ను బెదరిస్తుంది. ఒకవేళ నువ్వు అమెరికాకు వెళ్తే తాను వెంటనే మీడియాకు ఈ విషయాలన్నీ చెప్తానని, అప్పుడు మీడియా వారు నిన్ను వదలబోరని మోనిత కార్తీక్‌ను హెచ్చరిస్తుంది. ఈ మాటలన్నిటినీ విన్న కార్తీక్ తాపీగా భారతిని వాటర్ బాటిల్ తీసుకురావాలని చెప్తాడు. బహుశా దాహమేస్తుందేమోనని లోపలికి వెళ్లి భారతి వాటర్ బాటిల్ తీసుకువస్తుంది. అప్పుడు కార్తిక్ సదరు వాటర్ బాటిల్‌ను మోనిత చేతిలో పెడతాడు. దాంతో మోనిత షాక్ అవుతుంది. వాటర్ తాగు.. ఇప్పటి వరకు అరిచి అరిచి అలసిపోయావ్.. నువ్వు ఎన్ని చెప్పినా వినేది లేదని, తాను అమెరికా వెళ్తున్నానని, విత్ ఫ్యామిలీతోనే అమెరికాకు వెళ్తున్నానని, బెదిరింపులకు భయపడేది లేదని చెప్తాడు. అలా చెప్తూనే భారతిని ఉద్దేశించి చూశావా మోనిత విశ్వరూపం అని అంటూనే అక్కడి నుంచి కార్తీక్ వెళ్లిపోతాడు.

Karthika Deepam October 23 Today episode

Karthika Deepam October 23 Today episode

తన ముందు నుంచే కార్తీక్ వెళ్లిపోవడం చూసి మోనిత ఎమోషనల్ అవుతుంది. ఇలా కథ సాగుతున్న క్రమంలో ఊహించని కీలక మలుపు కథలో వస్తుంది. ఆనందరావు కార్తీక్ రాలేదని అనుకుంటున్న క్రమంలో అక్కడకు పిల్లలు హిమ, సౌర్య వస్తారు. అంతలోనే అక్కడకు గతంలో వాళ్లింట్లో పని చేసి మానేసిన పనిమనిషి మాలతి వస్తుంది. మాలతిని చూసి ఏమైందని దీప, సౌందర్య ఏమైందని అడగ్గా, తన భర్తకు అనుమానం జబ్బు వచ్చిందని అంటుంది. పిల్లల్ని కూడా చూడకుండా తన కడుపులో పెరిగే బిడ్డకు తండ్రిని తాను కాదని తన భర్త అంటున్నాడని మాలతి అంటుంది.

అంతలోనే హిమ, సౌర్య అనుమానం అంటే ఏంటని సౌందర్యను అడుగుతుంది. ఈ క్రమంలోనే మాలతి ఏడుస్తుండగా, దీప, సౌందర్య ఆమెకు ధైర్యం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే మాలతి దీపను ఉద్దేశించి నువ్వు అదృష్ట వంతురాలమ్మ… అందరూ నీ అంత అదృష్టవంతులు కాదమ్మ అంటుంది. అలా మాలతిని ఓదార్చి ఇంటికి పంపుతారు. అయితే, ఇంతలోనే కార్తీక్ కూడా ట్విస్ట్ ఇస్తాడు. ఇంటకి వచ్చి మనం అమెరికా వెళ్లడం లేదని చెప్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో మోనిత కూడా కారులో అదే ఇంటికి రావడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

Tags

Latest News

Related News