• Telugu News
  • movies

Karthika Deepam October 25 Today episode : ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో మోనిత.. తనకేం సంబంధం లేదన్న కార్తీక్.. చివరకు..

Karthika Deepam October 25 Today episode : బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ‘కార్తీక దీపం’ సీరియల్ ఎపిసోడ్స్ తారాస్థాయికి చేరుకున్నట్లు కనబడుతున్నాయి. గత ఎపిసోడ్‌లో డాక్టర్ బాబు కార్తీక్‌ను మోనిత బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కార్తీక్ అమెరికా వెళ్లడం ఆపేస్తాడు. కాగా, తాజా ఎపిసోడ్ సోమవారం విడుదలైంది. 1180వ ఎపిసోడ్ హై లైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మోనిత బెదిరింపుల సంగతి సౌందర్యకు చెప్తాడు కార్తీక్. ఈ క్రమంలోనే మోనితను ఏం చేయాలని […].

By: jyothi

Updated On - Mon - 25 October 21

Karthika Deepam October 25 Today episode : ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో మోనిత.. తనకేం సంబంధం లేదన్న కార్తీక్.. చివరకు..

Karthika Deepam October 25 Today episode : బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ‘కార్తీక దీపం’ సీరియల్ ఎపిసోడ్స్ తారాస్థాయికి చేరుకున్నట్లు కనబడుతున్నాయి. గత ఎపిసోడ్‌లో డాక్టర్ బాబు కార్తీక్‌ను మోనిత బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కార్తీక్ అమెరికా వెళ్లడం ఆపేస్తాడు. కాగా, తాజా ఎపిసోడ్ సోమవారం విడుదలైంది. 1180వ ఎపిసోడ్ హై లైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

మోనిత బెదిరింపుల సంగతి సౌందర్యకు చెప్తాడు కార్తీక్. ఈ క్రమంలోనే మోనితను ఏం చేయాలని తల్లి సౌందర్యను కార్తీక్ అడుగుతుంటాడు. మోనిత గురించి తలుచుకుని కార్తీక్ ఫైర్ అవుతుంటాడు. ఇంతలోనే దీప ఎంట్రీ ఇస్తుంది. దీపను చూసి సౌందర్య టాపిక్ డైవర్ట్ చేస్తుంది. కార్తీక్‌తో వేరే టాపిక్ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటుంది. ఇక దీపతో అమెరికా వెళ్లినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవుతాయా? అని సౌందర్య అడుగుతుంది. దాంతో తనకు తెలియదని దీప సమాధానం చెప్తుంది. మరో వైపున మోనిత స్నానం చేసొచ్చి సోఫాలో కూర్చొని కార్తీక్‌ను గురించే ఆలోచిస్తుంటుంది. ఆ సమయంలోనే నిండు గర్భిణిగా ఉన్న మోనితకు పురిటినొప్పులు స్టార్ట్ అవుతాయి. అది గమనించిన పోలీసులు మోనితను ఆస్పత్రికి తరలిస్తారు.

ఈ సంగతులు ఇలా ఉంచితే మరో వైపున సౌర్య, హిమలు ముచ్చటించుకుంటారు. మోనిత ఆంటీ విషయంలో డాడీ ఆలోచన సరైనదే అని చర్చించుకుంటారు. ఇదంతా కార్తీక్ వింటూ భావోద్వేగానికి గురవుతూ ఉంటాడు. ఇక అంతలోనే అక్కడికి వచ్చిన దీప ఆయనకు ఏమైనా జరిగితే తాను తట్టుకోలేనని, ఆయన బాధపడితే ఆయన కంటే ఎక్కువగా తాను బాధపడతానని దీప చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Karthika Deepam October 25 Today episode

Karthika Deepam October 25 Today episode

ఈ సందర్భంలోనే కార్తీక్‌కు భారతి నుంచి ఫోన్ వస్తుంది. ఆ సమయంలో కార్తీక్ పక్కన సౌందర్య ఉంటుంది. అయితే, కార్తీక్ భారతి నుంచి ఫోన్ వస్తుందని తెలిసి లిఫ్ట్ చేయకుండానే ఉంటాడు. అయితే, మళ్లీ మళ్లీ భారతి ఫోస్ చేస్తుండగా, అయిష్టంగానే కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేశాక కార్తీక్ కోపంగా భారతితో మాట్లాడుతాడు. ఎందుకు ఫోన్ చేశావ్? మళ్లీ ఏదైనా కొత్త పథకం మీ ఫ్రెండ్ ప్లాన్ చేసిందా అని అడుగుతాడు. అంతలోనే అటు వైపు నుంచి భారతి నొప్పులు పడుతుంది. ఆస్పత్రిలో అడ్మిట్ అయింది, విషమ పరిస్థితి ఉండేలా ఉందని అంటుంది. సీరియస్ సిచ్యువేషన్ ఉందని భారతి చెప్తుంది. అయితే, అలా భారతి చెప్పినప్పటికీ కార్తీక్ సరిగా స్పందించడు.

 

మోనిత చచ్చిపోతే.. చచ్చిపోతే భారతి నాకేంటి సంబంధం అని కార్తీక్ ఆవేశంగా అంటాడు. అంతలోనే అక్కడికి దీప చాయ్ తీసుకుని వస్తుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మోనిత నొప్పులు పడుతుందని, సీరియస్ సిచ్యువేషన్‌లో ఉందని తెలుసుకుని దీప ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.

 

Tags

Latest News

Related News