karthikadeepam oct 27 episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ సరికొత్త ట్విస్టులతో ముందుకు సాగుతోంది. కార్తీక్ అమెరికా ప్రయాణాన్ని ఎలాగోలా అడ్డుకున్న మోనిత.. డాక్టర్ బాబు, సౌందర్యకు షాకింగ్ నిజం చెప్పి వారిని ఆందోళనకు గురిచేసింది. 1,182వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మొత్తం భాగం చూడాల్సిందే…
వంటలక్క హిమ బ్లడ్ శాంపిల్స్ కోసం ఆస్పత్రికి వెళ్తుండగా మా ఆయన, అత్తయ్య తన వద్ద ఎదో దాచాలని చూస్తున్నారని ఆలోచిస్తుంటుంది. మరో వైపు మోనిత మోనిత పురిటి నొప్పులతో తనకు ఇంజెక్షన్ చేయొద్దని ‘భారతిని వేడుకుంటుంది. కార్తీక్ వస్తున్నాడా లేదా నేను చనిపోయే లోపు ఓ నిజం చెప్పాలని బాధపడుతుంటుంది. అది నాకు పుట్టబోయే బిడ్డ ఫ్యూచర్‌కు ఎంతో మేలు చేస్తుందని ఆవేదన చెందుతుంది.
మోనిత చెప్పింది అంతా అబద్ధమేనా..
దీప తన కూతురు బ్లడ్ శాంపిల్ తీసుకుంటుండగా.. కార్తీక్, సౌందర్యల మాటలను గుర్తుచేసుకుంటుంది. తన భర్త శాంపిల్స్‌ను డబ్బులు ఇచ్చి మోనిత తన గర్భంలో ప్రవేశ పెట్టుకుందని వాళ్లు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. పల్లవి అనే అమ్మాయి ద్వారా ఇదంతా జరిగిందని తెలుసుకున్న దీప.. హిమకు బ్లడ్ రిపోర్టు ఇచ్చిన అమ్మాయి పేరు కూడా పల్లవి అని తెలుసుకుంటుంది. ఆమెనే ఇమే అనుకొని నీకు ‘బుద్ధి ఉందా? ఇలాంటి పనులు ఎలా చేస్తావ్ ?’ అంటూ చెడామడా తిడుతుంది. ఏం జరిగింది ఎందుకు తిడుతున్నారని పల్లవి అడుగగా.. నా భర్త శాంపిల్స్‌ని మోనితకు డబ్బులకు ఆశపడి ఇచ్చేశావ్ అంటుంది. దీంతో షాక్ అయిన పల్లవి అలాంటిది ఏమీ నేను చేయలేదు. మీరు పొరబడ్డారని అంటుంది. కోటి రూపాలకు ఆశపడి మోనితకు నా భర్త శాంపిల్ ఇచ్చినందుకు నీ మీద కేసు పెడతానని దీప అనడంతో పల్లవి సీరియస్ అవుతుంది.
karthikadeepam oct 27 episode -1
అసలు మోనిత ఎవరో నాకు తెలియదు.. మా తల్లిదండ్రులు చనిపోతే నేను 3నెలలు సెలవులో ఉన్నాను.. అసలు మీ వారు శాంపిల్స్ ఇచ్చారో కూడా తెలీదు. ఒకసారి చెక్ చేస్తానని సిస్టమ్ దగ్గరకు వెళ్తుంది. మేడమ్ మీ వారు శాంపిల్స్ ఇచ్చారు కానీ, రిపోర్ట్ నేటికీ తీసుకోలేదు. మేము ఎప్పుడూ తప్పులు చేయము.. కావాలంటే వెళ్లి కేసు పెట్టుకోండి.. మేము అన్నింటికీ సిద్ధం అని బదులిస్తుంది పల్లవి. దీంతో దీప ఆలోచిస్తూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది.
నాది కృత్రిమ గర్భం కాదు కార్తీక్..
కార్తీక్ ఆస్పత్రికి వెళ్లగానే భారతి బెడ్ మీద ఉలుకుపలుకూ లేకుండా మోనితను లేపుతుంది. చూడు ఎవరచ్చారో అంటుంది. ఎంటీ మళ్లీ కొత్త డ్రామా అంటూ కార్తీక్ విసుక్కుంటాడు. మోనిత కళ్లు తెరిచి కార్తీక్ వచ్చావా.. అంటూ తనలో తనే మురిసిపోతుంది. ‘నేను చచ్చిపోతాను కార్తీక్.. నాకు తెలుస్తుంది. కానీ, నేను మరణించేలోపు నీకో నిజం చెప్పాలి. నాది కృతిమ గర్భం కానేకాదు. సహజంగా వచ్చినది. నీ వల్లే నేను తల్లిని అయ్యాను. అంటూ ఏడుస్తుంది. దీంతో సౌందర్య, కార్తీక్, భారతి ముగ్గురు షాక్ అవుతారు. ఎవరికీ నోట్లో మాటరాదు. చివరగా కార్తీక్ ఆవేశంతో ‘ఆపు మోనితా.. నీ నాటకాలు.. ఏంటి భారతి ఇదంతా.. ఇందుకేనా నన్ను నువ్వు పిలిచింది అంటూ కోపడతాడు.
మోనిత బాధపడుతూనే చనిపోయే ముందు నేను ఎందుకు అబద్ధం చెబుతాను కార్తీక్.. ఇన్నాళ్లు అబద్దాలు చెప్పి ఉండొచ్చు.. కానీ, నా మీద ఒట్టు.. నేను ప్రాణంగా ఇష్టపడుతున్న నీ మీద ఒట్టు.. పుట్టబోయే బిడ్డ మీద కూడా ఒట్టు.. నేను చెప్పింది నిజం. ఆ రోజు కోర్టులో కూడా ఇలాంటి కుట్రలే చేశావు. నేను నిన్ను నమ్మను. నీ కుట్రలు ఇక ఆపు అని ఆవేశంగా అంటాడు కార్తీక్.. ఆంటీ మీరైనా నా మాటలు నమ్మండి.. కార్తీక్ శాంపిల్స్ నేను తీసుకోలేదు. అసలు ల్యాబ్ కు కూడా వెళ్లలేదు. కావాలంటే మీరే కనుక్కోండి.. నాది సహజంగా ఏర్పడిన గర్భం.. బాధపడుతూ చెబుతుంది మోనిత..
ఇదే నిజమైతే కృత్రిమ గర్భం అని ఇన్నాళ్లు ఎందుకు ప్రచారం చేశావ్.. అని డాక్టర్ బాబు అనడంతో నా క్యారెక్టర్ కాపాడుకునేందుకు చేశానంటూ బదులిస్తుంది. ఒక అమ్మాయి పెళ్లి కాకుండా గర్భం దాల్చిందంటే సమాజం ఎలా చూస్తుంది.. నన్ను అందరూ చీ కొడతారు. నాకు జన్మించిన పిల్లలను నానా పేర్లతో పిలుస్తారు. అందుకే ఇలా చెప్పానని అంటుంది మోనిత.. అన్నీ బాగానే ఉన్న నీ భార్య దీపను 11 సంత్సరాలు దూరం చేశావ్. ఇక నన్ను దగ్గరకు రాణిస్తావని నమ్మకం ఎంటనీ అడుగుతుంది మోనిత.. అందుకే ఇన్నిరోజులు దాచాను కార్తీక్.. ఓ రోజు తాగిన మత్తులో నువ్వు నేను కలిశాం.. అనుకోకుండా అలా అయిపోయింది కార్తీక్ అంటూ మోనిత ఏడుస్తుంటుంది. కోపంతో కార్తీక్ ఆపు మోనిత ఇక.. మమ్మీ ఏంటీ దరిద్రం పదా పోదాం అనగానే .. భారతి అర్థం చేసుకో కార్తీక్ .. తను చనిపోతుందని మళ్లీ ఆపుతుంది. ఈ బిడ్డ నాది కాదు.. నువ్వు ఏమైనా చేసుకో అంటాడు కార్తీక్.. నేను చనిపోయాక అయినా నీకు అర్థం అవుతుందనుకుంటా కార్తీక్.. ఇది మన బిడ్డే అని… నీ రక్తాన్ని ఒంటరిగా వదిలేయకు కార్తీక్ అని మోనిత బాధపడుతుంది… తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే కార్తీక్ దీపం కొనసాగుతోంది.