Keerthy Suresh Became Star Heroine Because Of Nithya Menon : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వారు కూడా ఉంటారు. ఒక్క సినిమాతో కెరీర్ ను కోల్పోయిన వారు కూడా ఉంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం ఒక్కో సినిమాతో తానేంటూ నిరూపించుకుంది. ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించి స్టార్ హీరోయిన్ లిస్టులోకి వెళ్లిపోయింది.
అయితే ఇప్పుడు మహానటిగా గుర్తింపు పొందుతున్న ఆమె నిత్యా మీనన్ వల్లే స్టార్ డమ్ పొందింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. మహానటి సినిమాతోనే కీర్తి సురేష్ కు నేషనల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అయితే ఈ సినిమాకు ముందుగా నిత్యా మీనన్ ను తీసుకున్నారంట.
Keerthy Suresh Became Star Heroine Because Of Nithya Menon
సావిత్రి గారి పాత్రకు నిత్యా మీనన్ అయితేనే కరెక్టుగా సరిపోతుందని భావించిన నాగ్ అశ్విన్ ఆమెతో షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ నిత్యా మీనన్ ప్రవర్తన ఎందుకో నాగ్ అశ్విన్ కు నచ్చలేదంట. ప్రతి విషయంలో కండీషన్స్ పెట్టడంతో ఈ విషయాన్ని అశ్వినీ దత్ కు చెప్పారంట. వెంటనే అశ్వినీదత్ ఆమెను పిలిచి క్లాస్ పీకారు.
దాంతో బాగా హర్ట్ అయిన నిత్యామీనన్ ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత బాగా ఆలోచించి కీర్తి సురేష్ ను ఇందులోకి తీసుకున్నారు. ఈ సినిమాతో కీర్తి సురేష్ ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. ఒకవేళ నిత్యా మీనన్ నటించి ఉంటే కీర్తికి ఇంత పేరు వచ్చి ఉండేది కాదేమో.