Nagarjuna: నాగార్జున వదిలేసిన 5 సినిమాలు ఏంటో మీకు తెలుసా…?

Nagarjuna తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వర్ రావు కొడుకు గా ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున కెరీర్ మొదట్లో చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో నాగార్జున కెరియర్ నార్మల్ గా సాగుతున్న సమయంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాతో ఒక్కసారిగా నాగార్జున మాస్ హీరోగా మారిపోయాడు అలాగే కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా నమోదు చేసుకున్నాడు అప్పటి నుంచి నాగార్జున వెనుదిరిగి చూడకుండా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ […].

By: jyothi

Updated On - Mon - 23 August 21

Nagarjuna: నాగార్జున వదిలేసిన 5 సినిమాలు ఏంటో మీకు తెలుసా…?

Nagarjuna తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వర్ రావు కొడుకు గా ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున కెరీర్ మొదట్లో చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో నాగార్జున కెరియర్ నార్మల్ గా సాగుతున్న సమయంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాతో ఒక్కసారిగా నాగార్జున మాస్ హీరోగా మారిపోయాడు అలాగే కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా నమోదు చేసుకున్నాడు అప్పటి నుంచి నాగార్జున వెనుదిరిగి చూడకుండా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లో అగ్ర హీరోగా గుర్తింపు పొందాడు నాగార్జున కెరియర్ లో తను చేయాల్సిన 5 సినిమాలు వదిలేసుకున్నారు అవేం సినిమాలో చూద్దాం రండి…

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కి వెంకటేష్ పాత్ర కోసం మొదటగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల నాగార్జునని అడిగాడు నాగార్జునకి కథ నచ్చకపోవడం వల్లనో లేదా డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్లనో మొత్తానికి అయితే ఆ సినిమా చేయలేకపోయాడు. దాంతో ఆసినిమా వెంకటేష్ చేశాడు ఈ సినిమా మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి వెంకటేష్ కి మంచి విజయాన్ని అందించింది.

మౌనరాగం

నాగార్జున కెరీర్ మొదట్లో లెజెండరీ డైరెక్టర్ అయిన మణిరత్నం తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు ఆ విషయాన్ని మణిరత్నం కూడా చెప్పాడు దాంతో మణిరత్నం మౌనరాగం సినిమా కోసం నాగార్జునని సంప్రదించగా కథ నచ్చకపోవడంతో నాగార్జున సినిమా చేయలేకపోయాడు దాంతో కార్తీక్ ఆ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో గీతాంజలి సినిమా చేశాడు ఈ సినిమా నాగార్జున కెరీర్లో ఒక క్లాసికల్ హిట్ గా మిగిలిపోయింది…

కలిసుందాం రా

కలిసుందాం రా సినిమా స్టోరీ ని మొదటిగా దర్శకుడు ఉదయశంకర్ నాగార్జునకి వినిపించాడు కానీ అది ఫ్యామిలీ సబ్జెక్ట్ కావడంతో ఆడుతుందో లేదో అనే ఉద్దేశంతో నాగార్జున సినిమా ని రిజెక్ట్ చేశాడు ఆ తర్వాత డైరెక్టర్ వెంకటేష్ ని అప్రోచ్ అయి కథ చెప్పాడు ఆ కథ వెంకటేష్ కి నచ్చడంతో వెంకటేష్ తో సినిమా తీశాడు ఆ సినిమా వెంకటేష్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది మొత్తం వెంకటేష్ కెరియర్ లో టాప్ టెన్ సినిమాల్లో కలిసుందాం రా సినిమా కూడా ఒక సినిమా గా మిగిలిపోయింది…

మెకానిక్ అల్లుడు

దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నాగేశ్వరరావు ముఖ్య పాత్రలో నటించిన మెకానిక్ అల్లుడు సినిమా స్టోరీని కూడా మొదటగా నాగార్జున కి వినిపించాడు దర్శకుడు కానీ ఆ స్టోరీ నాగార్జునకి నచ్చకపోవడంతో ఆ స్టోరీని రిజెక్ట్ చేశాడు…

ఆహా

దర్శకుడు సురేష్ కృష్ణ అన్నపూర్ణ బ్యానర్లో ఒక సినిమా చేయాలనుకుని ఆహా కథని నాగార్జునకి వినిపించాడు కానీ కథ నాగార్జునకి నచ్చకపోవడంతో అన్నపూర్ణ బ్యానర్ లోనే జగపతిబాబుని హీరోగా పెట్టి ఈ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. జగపతిబాబుకి కూడా నటనలో మంచి మార్కులు పడ్డాయి జగపతిబాబు తను పోషించిన ఈ పాత్రలో సరిగ్గా ఒదిగిపోయాడు అని విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి…
ఇలా నాగార్జున తన కెరీర్లో చేయాల్సిన 5 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు ఆ సినిమాలు చేసి ఉంటే నాగార్జున కెరియర్ ఇంకా టాప్ పొజిషన్ లో ఉండేదని మనం అర్థం చేసుకోవచ్చు

Latest News

Related News