Krithi Shetty : కన్నడ భామ కృతిశెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. మొదట్లో వరుస హిట్లతో అగ్ర హీరోయిన్లకు చెమటలు పట్టించింది ఈ భామ. మొదటి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఆమెను చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.
దాని తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ లాంటి వరుస హిట్లు అందుకుంది. కానీ ఆమెకు ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే దాని తర్వాత వరుసగా మూడు ప్లాపులు వచ్చాయి. అయినా సరే ఆమెకు అవకాశాలు తగ్గట్లేదు. తాజాగా ఆమె చైతన్యతో కలిసి నటించిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా కృతిశెట్టి కు సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఆమె ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ తో చాలా లిప్ కిస్ సీన్లు చేసింది. అయితే ఇలా హీరోతో కిస్ సీన్ ఉన్నప్పుడల్లా ఆమె తన పెదవులను సబ్బుతో కడుక్కునేదంట. ఇది చూసిన వైష్ణవ్ చాలా హర్ట్ అయ్యాడంట.
కానీ ఆమెకు స్కిన్ ఎలర్జీ ఉందని, అందుకే ఇలా కడుక్కుంటుందని తర్వాత తెలిసిందంట వైష్ణవ్ కు. దాంతో ఆయన తన తప్పు తెలుసుకుని ఆమె వద్దకు వెళ్లి మరీ సారీ చెప్పాడంట.
Also Read : Nandamuri Balakishna : బాలయ్య ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమించారా.. అప్పట్లో బయట పడ్డ నిజం ఇదే..!
Also Read : Star Hero And Heroines : మత్తేక్కించే అందాల మధ్య తారల టాటూలు, వాటి అర్ధాలు తెలిస్తే ముక్కు మీద వేలేసుకుంటారు