Krithi Shetty : కన్నడ బ్యూటీ కృతిశెట్టి కెరీర్ ఇప్పుడు పడుతూ లేస్తూ సాగుతోంది. ఆమె మొదట్లో ఓ ఊపు ఊపేసింది. వరుసగా హిట్లు కొట్టడంతో అంతా ఆమెను లక్కీ హీరోయిన్ అంటూ నెత్తిన పెట్టుకున్నారు. వరుస పెట్టి అవకాశాలు ఇచ్చేశారు. కానీ మూడు హిట్ల తర్వాత ఆమె కెరీర్ మొత్తం డౌన్ అయిపోయింది.
ఆమె చేస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. మూడు ప్లాపుల తర్వాత ఆమె నటించిన తాజాగా మూవీ కస్టడీ. నాగచైతన్య హీరోగా వచ్చిన ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని కృతి భావించింది. మే 12న రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.
అయితే మూవీ ప్రమోషన్ లో భాగంగా కృతిశెట్టి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీకు సమంత లాగా ఐటెం సాంగ్స్ చేసే ఆఫర్ వస్తే చేస్తారా అని అడగ్గా.. నాకు అలాంటివి చేయడం అస్సలు ఇష్టం లేదు. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు చేశాను.
హీరో నానితో లిప్ లాక్, రొమాన్స్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. చాలా కష్టంగా అనిపించింది. అప్పుడే నాకు ఇష్టం లేని పనులు చేయొద్దని నిర్ణయించు కున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కృతి. అయితే నాని ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. ఉప్పెన సినిమాలో కూడా లిప్ లాక్ ఇచ్చావ్ కదా.. అప్పుడెందుకు ఇలా అనలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక రకంగా నానిని అవమానించడమే అంటున్నారు.
Read Also : Mega Star Chiranjeevi : ఆ విషయంలో పవన్ నాకు నచ్చడు.. చిరంజీవి సీరియస్ కామెంట్లు..!
Read Also : Anchor Jhansi : జగపతి బాబుతో ఎఫైర్ అంటగట్టారు.. యాంకర్ ఝాన్సీ ఫైర్..!