Lamps : దీపాలు వెలిగించడం వెనుకున్న శాస్త్రీయ కారణాలివే..

Lamps : ఏదేని శుభకార్యాల సమయంలో కాని, కొత్త పనులు ప్రారంభించేపుడు కాని మనం తరచుగా దీపాలను వెలిగిస్తుంటాం. అలా ప్రతీ ఒక్క కార్యక్రమానికి దీపం వెలిగించాలని పెద్దలు చెప్తుంటారు. సంప్రదాయం ప్రకారం అలా చేయాలని అంటుంటారు. కానీ, దీపం వెలిగించడం వెనుకున్న శాస్త్రీయ కారణాలు చెప్పరు. హిందూ మత ఆచారాల ప్రకారం చాలా మంది ప్రతీ రోజు దీపాలు వెలిగిస్తుండటం మనం చూడొచ్చు. కాగా, దీపాల వెలిగించడం వెనుకున్న రీజన్స్ ఈ స్టోరిలో తెలుసుకుందాం. భారతదేశంలోనే […].

By: jyothi

Updated On - Thu - 25 November 21

Lamps : దీపాలు వెలిగించడం వెనుకున్న శాస్త్రీయ కారణాలివే..

Lamps : ఏదేని శుభకార్యాల సమయంలో కాని, కొత్త పనులు ప్రారంభించేపుడు కాని మనం తరచుగా దీపాలను వెలిగిస్తుంటాం. అలా ప్రతీ ఒక్క కార్యక్రమానికి దీపం వెలిగించాలని పెద్దలు చెప్తుంటారు. సంప్రదాయం ప్రకారం అలా చేయాలని అంటుంటారు. కానీ, దీపం వెలిగించడం వెనుకున్న శాస్త్రీయ కారణాలు చెప్పరు. హిందూ మత ఆచారాల ప్రకారం చాలా మంది ప్రతీ రోజు దీపాలు వెలిగిస్తుండటం మనం చూడొచ్చు. కాగా, దీపాల వెలిగించడం వెనుకున్న రీజన్స్ ఈ స్టోరిలో తెలుసుకుందాం.


భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్న హిందువులు కంపల్సరీగా పర్వదినాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. దీపారాధన కూడా చేస్తుంటారు. తమ ఇళ్లలోని పూజగదుల్లో దీపాలు పెడుతుంటారు. ఇక టెంపుల్స్‌లో అయితే భగవంతుడి ఎదుట దీపాలు వెలుగుతూనే ఉంటాయి. దేవాలయాల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది.


దీపం సానుకూలత అనగా పాజిటివ్‌నెస్‌కు సింబల్ అని ప్రజలు భావిస్తుంటారు. అజ్ఞానాం అనే చీకటిని తొలగించి కాంతిని ప్రసాదించే వెలుగులు దీపం వల్ల వస్తాయని అంటారు. దీపాలను నెయ్యితో వెలిగిస్తే కనుక ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది.

Lamps-2

Lamps-2

దీపాలు వెలిగించడం వలన వాతావరణంలో అయస్కాంత మార్పులు కలుగుతాయి. అలా విద్యుదయస్కాంత తరంగాలు ఏర్పడటం వలన మానవుడి శరీరంలోని రక్తకణాలు ఉత్తేజితమవుతాయి. ఇది దీపాలు వెలగించడం వలన కలిగే శాస్త్రీయమైన లాభం. కాగా, ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా సూక్ష్మజీవులు నాశనం అవుతాయి. ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే వాతావరణం అంతా కూడా మెరుగుపడి, కాలుష్యం కూడా తగ్గుతుంది. దీపాలు వెలగించి ఉన్నట్లయితే ఇంటి లోపల ఉండబడే బ్యాక్టీరియాలన్నీ కూడా తొలగించబడుతాయి. దీపం ఎక్కడ ఉంటే అక్కడ సానుకూల పవనాలు ఉంటాయని పెద్దలు వివరిస్తున్నారు.


ఏదేని పనిని స్టార్ట్ చేసినపుడు దీపం వెలగిస్తుంటారు. అలా చేయడం వలన అద్భుతమైన శక్తి అందుతుందని నమ్మకం. దీపం వెలుగుతో చీకటి మాయమవడంతో పాటు అంధకారం అంతా కూడా తొలగించబడుతుంది. అంతటి శక్తి కలిగిన దీపాన్ని తప్పకుండా ఆరాధించాల్సి ఉంటుంది. దీపానికి నమస్కరించడమే కాదు. దాని చుట్టు ప్రదక్షిణలు చేయాలి. అలా చేయడం వలన సానుకూల పవనాలు చేరుతాయి. దీపాన్ని వెలిగించడం వలన జీవిత ఎదుగుదలకు కావలిసిన వెలుతురు వస్తుందని, అందుకు కావాల్సిన సంకేతాలు అందుతాయని పెద్దలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులు అత్యంత శ్రద్ధగా భగవంతుడికి దీపాలు వెలిగిస్తుంటారు. దీపాలు వెలిగించడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని పెద్దలు అంటున్నారు.

Tags

Latest News

Related News