Lavanya Tripathi : మెగా కోడలు కాబోతోంది లావణ్య త్రిపాఠి. నాగబాబు వారసుడు వరుణ్ తేజ్ తో ఆమె ఐదేండ్లుగా ప్రేమలో ఉంది. కానీ ఇన్ని రోజులు బయట పెట్టలేదు. ఎన్ని వార్తలు వచ్చినా సరే వాటిపై ఇరువురు స్పందించలేదు. కానీ నిన్న వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. దాంతో మెగా కోడలు లావణ్య త్రిపాఠి వివరాలు ఏంటా అని అంతా ఆరా తీస్తున్నారు.
లావణ్య త్రిపాఠి పుట్టింది అయోధ్యలో. ఆమె తండ్రి అక్కడి హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. తల్లి స్కూల్ టీచర్. ఆమెకు ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ఆమె స్కూల్ డేస్ మొత్తం డెహ్రాడూన్ లోనే జరిగాయి. లావణ్యకు ఇంటర్ అయిపోయినప్పటి నుంచే సినిమాలపై మంచి ఆసక్తి ఏర్పడింది.
ఇదే విషయాన్ని తండ్రికి చెప్పింది. తాను చదువుకోనని.. సినిమాల్లో నటిస్తానని చెప్పింది. కానీ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాతే ఏదైనా అని ఆమె తండ్రి చెప్పారు. దాంతో ముంబై వచ్చి ఎకనామిక్స్ లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలోనే ఆమె మిస్ ఉత్తారాఖండ్ టైటిల్ కూడా గెలుచుకుంది.
ఆమెకు భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం కూడా ఉంది. ఆమెకు మొదటిసారి 2012లో సినిమా ఛాన్స్ వచ్చింది. అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, మిస్టర్, అంతరిక్షం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి క్రేజీ సినిమాల్లో నటించింది.
మిస్టర్ సినిమా సమయంలోనే వరుణ్ తేజ్ తో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం చిగురించి.. చివరకు ప్రేమగా మారిపోయింది. దాదాపు ఐదేండ్లు ప్రేమలో ఉన్న ఈ జంట.. తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకుని పెండ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి పెండ్లి ఇటలీలో లేదంటే రాజస్థాన్ లోని ప్యాలెస్ లో జరిగే అవకాశం ఉంది.
Read Also : Ram Gopal Varma : రాజమౌళి, సుకుమార్ వేస్ట్.. బ్యాక్ గ్రౌండ్ లేని వారితో సినిమా చేయరుః ఆర్జీవీ
Read Also : Actress Madhavi Latha : స్టార్ హీరోలు మిగతా వారిని తొక్కేస్తున్నారు.. మాధవీ లత సంచలన వ్యాఖ్యలు..!