Loneliest House : ఆ దీవిలో ఒకే ఇల్లు.. కానీ అందులో ఎవరూ ఉండరు.. ఎందుకంటే..?

Loneliest House : చాలా మంది పర్యటకులు దీవులను ఎక్కువగా సందర్శిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దీవికి ఓ స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఎవరూ ఉండరు. కేవలం ఒక ఇల్లు మాత్రమే ఉంది. దీనిలో ఉండేందుకు ఎవరూ సాహసం చేయరు. ఎందుకంటే దాని వెనుక పెద్ద రహస్యమే ఉంది. ఇంతకీ ఆ దీవి ఎక్కడుంది? ఆ రహస్యమేంటి? తెలుసుకుందాం పదండి.. ఐల్యాండ్‌లో దక్షిణం వైపున దాదాపుగా 15 దీవులు ఉన్నాయి. ఇందులో ఓ దీవిలో కేవలం […].

By: jyothi

Published Date - Wed - 1 December 21

Loneliest House : ఆ దీవిలో ఒకే ఇల్లు.. కానీ అందులో ఎవరూ ఉండరు.. ఎందుకంటే..?

Loneliest House : చాలా మంది పర్యటకులు దీవులను ఎక్కువగా సందర్శిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దీవికి ఓ స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఎవరూ ఉండరు. కేవలం ఒక ఇల్లు మాత్రమే ఉంది. దీనిలో ఉండేందుకు ఎవరూ సాహసం చేయరు. ఎందుకంటే దాని వెనుక పెద్ద రహస్యమే ఉంది. ఇంతకీ ఆ దీవి ఎక్కడుంది? ఆ రహస్యమేంటి? తెలుసుకుందాం పదండి..


loneliest house

loneliest house



ఐల్యాండ్‌లో దక్షిణం వైపున దాదాపుగా 15 దీవులు ఉన్నాయి. ఇందులో ఓ దీవిలో కేవలం ఒకే ఇల్లు ఉంది. చూడ్డానికి అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఆ ఇంట్లో ఎవరూ పర్మినెంట్‌గా ఉండరు. పోని అక్కడ క్రుర జంతువులు ఉంటాయా అంటే అదీ లేదు. మరి కేవలం ఒకే ఇల్లు ఎందుకు కట్టారు. అది కూడా ఖాళీగానే ఉంటుంది. మరి ఎందుకు ఇక్కడ ఇళ్లు కట్టలేదు. అనే ప్రశ్నలు మీలో తలెత్తడం సహజం. కానీ సమాధానాలు వింటేని విచిత్రంగా ఉంటుంది. ఈ ఇంటి చుట్టూ ఎన్నో కథలు ఉన్నాయి. ఇంకా అది మిస్టరిగానే ఉంది. ఈ దీవిలో వరుసగా ఐదు కుటుంబాలు నివసించాయి. కానీ ఇప్పుడు ఒక్క వ్యక్తి కూడా లేడు. 1930 తర్వాత ఇందులో ఎవరు నివసించడం లేదు. అయితే ఓ ధనికుడు కేవలం జాంబీల కోసం ఈ ఇంటిని నిర్మించాడని ప్రచారం సాగుతోంది. అంటే నిజంగానే జాంబీలు ఉంటే వాటిని ఈ ఇంట్లో ఉంచాలని అతని ఆలోచనట. కానీ దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలేవి లేవు. ఈ ఇల్లు ఐలాండ్ సింగర్ బిజోర్క్ చెందినదని కొందరు చెబుతున్నారు. ఓ మతానికి సంబంధించిన పెద్దాయనదని మరి కొందరు చెబుతుంటారు. అయితే ఇదంతా సోషల్ మీడియాకు సంబంధించిన విషయం.


loneliest house

loneliest house



వాస్తవానికి ఎల్లిడాయ్ హంటింగ్ అసోసియేషన్ అనే సంస్థకు చెందినదట ఈ ఇల్లు. 1953వ సంవత్సరంలో దీనిని కట్టారు. వేటగాళ్లు దీనిని నిర్మించారు. ఆ అసోసియేషన్‌కు సంబంధించిన వారు పఫ్పిన్స్ బడ్స్‌ను వేటాడటానికి ఈ ఇంట్లో ఉండేవారు. ఈ ఇంటిని చూస్తే ఇందులో ఉండాలనిపిస్తుంది. కానీ ఇక్కడ కరెంట్, నీరు, మొబైల్ నెట్ వర్క్ లాంటివి ఏవీ ఉండవు.
చుట్టూ సముద్రం.. సాయంత్రం కాగానే చల్లటి గాలులు ఇక్కడ ఉండనివ్వవు. ఇక రాత్రి టైంలో పీడకళ వచ్చిందంటే భయం స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఇల్లు మాత్రం చాలా మంది పర్యాటలకు నచ్చుతోంది. సాహసాలు చేయాలనుకునే వారు అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అయితే.. ఇక్కడ ఉండేందుకు పర్మిషన్ ఉండదు. అందులో ఉండాలి అంటే.. ఎల్లిడాయ్ హంటింగ్ అసోసియేషన్‌లో మెంబర్ షిప్ ఉండాలి.

Tags

Latest News

Related News