Chiranjeevi : మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉన్నారు. దాదాపు 20 ఏండ్ల పాటు టాలీవుడ్ ను శాసించిన హీరో. ఇప్పటికీ వరుసగా మూవీలు చేస్తున్నాడు. అయితే ఆయన మొదట్లో చాలానే అవమానాలు ఎదుర్కున్నాడు. కానీ ఆయన వాటిని ఏనాడూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అందుకే ఈ స్థాయిలో ఉన్నాడు.
కాగా చిరంజీవిని మొదట్లో ఓ స్టార్ హీరోయిన్ దారుణంగా అవమానించింది. చిరంజీవి, మాధవి అప్పట్లో ఒకే సమయంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కానీ మాధవి తమిళ సినిమాలతో చాలా బిజీ అయిపోయింది. అక్కడ వరుస హిట్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ చిరు మాత్రం అప్పటికి చిన్న డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నాడు.
కాగా ఆయనకు ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో అవకాశం వచ్చింది. అందులో హీరోయిన్ గా మాధవిని తీసుకున్నారు. అయితే ఆమెకు స్టార్ హోటల్ ను బుక్ చేసి చిరుకు మాత్రం నార్మల్ హోటల్ బుక్ చేశారు. ఇక ఓ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత చిరును దారిలో దింపాలని మాధవికి ప్రొడ్యూసర్ చెప్పారు.
దాంతో మాధవి కారులో చిరు ఎక్కడానికి వెళ్లారు. ఆమె పక్కన కూర్చోబోతే.. ఏంటి నా పక్కన కూర్చుంటావా అంటూ ఆమె దారుణంగా అవమానించింది. దాంతో చిరు ముందు సీట్లో కూర్చున్నాడు. అప్పుడే తాను పెద్ద హీరో కావాలని చిరు భావించారంట. అలా కష్టపడి పెద్ద హీరో అయ్యాడు. ఆ తర్వాత మాధవి తన తప్పు తెలుసుకుని చిరుకు సారీ చెప్పింది. వీరి కాంబోలో అప్పట్లో బాగానే సినిమాలు వచ్చాయి.
Read Also : Heroines : పెండ్లైన హీరోలతో ఎఫైర్ నడిపిన హీరోయిన్లు వీరే.. మహా ముదుర్లు..!
Read Also : Charmy Kaur : పూరీతోనే కాదు.. ఆ డైరెక్టర్ తో కూడా డేటింగ్ చేసిన చార్మీ..!