Madhavi Latha : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. అప్పటి నుంచే ఈ మూవీ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చూడలేదని ప్రేక్షకులు మొత్తుకుంటున్నారు. ఒక రకంగా మూవీపై పాజిటివ్ టాక్ కంటే నెగెటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.
రామాయణం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ నటించారు. కానీ ఓం రౌత్ ఈ మూవీని తీసిన విధానం దారుణంగా ఉందని తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే విమర్శకులు కూడా ఆయన్ను దారుణంగా తిట్టిపోస్తున్నారు. తాజాగా హీరోయిన్ మాధవీలత కూడా స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. అసలు ఆదిపురుష్ సినిమా చూసిన వారంతా డైరెక్టర్ ను మాత్రమే తిడుతున్నారు. ఇందులో హీరో తప్పులేదా, ఇలాంటి సినిమా తీస్తున్నప్పుడు ఆయన చూసుకోవాలి కదా. ప్రభాస్ ఏమైనా కొత్త హీరోనా. ఇలాంటి సీన్లు వస్తున్నప్పుడు అబ్జెక్షన్ చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు.
Madhavi Latha Reacts On Adipurush Movie
ఈ రోజుల్లో హీరో చెప్పినట్టే డైరెక్టర్లు వింటున్నారు కదా. అంత పెద్ద హీరో అయి ఉండి సినిమాను ఇలా తీస్తుంటే ఎందుకు పట్టించుకోలేదంటూ విమర్శించింది మాధవీలత. ప్రభాస్ ఫ్యాన్స్ కావాలంటే నన్ను తిట్టుకోండి. కానీ ఇలాంటి సినిమా తీసేటప్పుడు కచ్చితంగా హీరో కూడా చూసుకోవాల్సింది అంటూ తెలిపింది ఆమె.
Read Also : Niharika Konidela : ఆ హీరో వీపుపై ఎక్కాలని ఉంది.. నిహారిక ఏంటీ మాటలు.. అందుకే విడాకులు అంటూ…!
Read Also : Rakul Preet Singh : అతడిని సీక్రెట్ గా రెండుసార్లు పెళ్లి చేసుకున్న రకుల్.. ఏంటి.. నిజమేనా?