Mahanati Savitri Granddaughter Madhuvanti Became Star Heroine : మహానటి.. ఈ పేరు వినగానే అందరికీ సావిత్రి అనే పేరు గుర్తుకు వస్తుంది. ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు గానీ.. అప్పట్లో ఆమె సౌత్ ఇండస్టరీలో అగ్ర హీరోయిన్ గా ఏలింది. నటనలో ఆమెకు తిరుగులేని ట్యాలెంట్ ఉంది. అందుకే ఆమెను అందరూ మహానటి అని పిలుచుకునేవారు. అంత గొప్ప స్థాయికి ఎదిగిన ఆమె జీవితం కూడా ఎన్నో ఎత్తు పల్లాలతో సమసిపోయింది.
చివరి రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులు అనుభవించింది. ఆమె జెమినీ గణేషన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఓ కొడుకు, కూతురు పుట్టారు. కూతురుకు విజయ చాముండేశ్వరి, కొడుకుకు సతీష్ అనే పేర్లు పెట్టారు. కానీ వీరు మాత్రం ఇండస్ట్రీకి రాలేదు. అయితే సావిత్రి మనవరాలు మాత్రం స్టార్ హీరోయిన్ గా ఏలింది.
Mahanati Savitri Granddaughter Madhuvanti Became Star Heroine
సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరికి ఓ కొడుకు ఉన్నాడు. ఆయనపేరు అరుణ్. ఆయన మధువంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ మధువంతి ఎవరో కాదు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మేనకోడలు. ఆమె తమిళంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణించింది.
ఇప్పుడు టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తోంది. ఇలా ఆమె వెండితెరపై బాగానే గుర్తింపు సాధించింది. విజయ చాముండేశ్వరి కోడలు అంటే సావిత్రికి మనవరాలు అవుతుంది కదా. ఇక ఈ విషయం తెలిసి చాలా మంది సావిత్రి మనవరాలు కూడా సినిమాల్లో రాణిస్తోంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also : Mega Fans Are Trolling Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి పాలిట శాపంగా మారిన నిహారిక.. ఎంత పనైపోయింది..!