Atharintiki Daaredi Movie : పవన్ కల్యాణ్ కెరీర్ లో మైలు రాయిలా నిలిచిపోయే మూవీ అత్తారింటికి దారేది. అప్పట్లో ఈ మూవీ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2013 సెప్టెంబర్ 27న విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలియింది. ఇంకా చెప్పాలంటే అప్పటి వరకు ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది ఈ సినిమా. దీంతో పవన్ కల్యాణ్ రేంజ్ అమాంతం డబుల్ అయిపోయింది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన 50 నిమిషాలు నిడివి ఉన్న సన్నివేశాలు విడుదలకు ముందే నెట్టింట వైరల్ అయ్యాయి. సినిమా మొత్తం ముందే రిలీజ్ అయినా సరే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
అయితే ఈ మూవీని త్రివిక్రమ్ ముందుగా మహేశ్ బాబు కోసం సిద్దం చేసుకున్నారంట. కానీ కెమెరా మాన్ గంగతో రాంబాబు సినిమా తర్వాత పవన్ కల్యాణ్ తన డేట్స్ మొత్తాన్ని త్రివిక్రమ్ కు కేటాయించాడంట. దాంతో అప్పటికప్పుడు త్రివిక్రమ్ దగ్గర అత్తారింటికి దారేది సినిమా కథ మాత్రమే ఉంది. వేరే కథ లేదు.
Mahesh Babu Gave Up Atharintiki Daaredi Movie
దాంతో ఈ కథతోనే ఆయన పవన్ హీరోగా సినిమా చేశారు. ఇలా మహేశ్ బాబు కోసం రెడీ చేసుకున్న కథను చివరకు పవన్ తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాను ఒకవేళ మహేశ్ చేసి ఆయనకు కూడా మంచి మైలురాయి లాంటి సినిమా పడేదని అంటున్నారు నెటిజన్లు.
Also Read : Director Ramgopal Varma : ఆమెకు అన్నీ జారిపోయాయ్.. ఆమెతో రొమాన్స్ చేయలేదుః ఆర్జీవీ..
Also Read : Heroines : తల్లిదండ్రులపైనే కేసులు పెట్టిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?