Mahesh Babu: మహేష్ బాబు 3 హిట్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ చేశారు.. అవి హిట్టా..ఫట్టా..?

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి కొన్ని సినిమాలు హీరోల కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమాలుగా నిలబడిపోయాయి అప్పటి ఎన్టీఆర్, నాగేశ్వరరావు దగ్గర్నుంచి ఇప్పటి జనరేషన్ లో వస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోల దాకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ నమోదు చేసుకున్నాయి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు తెలుగులో […].

By: jyothi

Published Date - Wed - 25 August 21

Mahesh Babu: మహేష్ బాబు 3 హిట్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ చేశారు.. అవి హిట్టా..ఫట్టా..?

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి కొన్ని సినిమాలు హీరోల కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమాలుగా నిలబడిపోయాయి అప్పటి ఎన్టీఆర్, నాగేశ్వరరావు దగ్గర్నుంచి ఇప్పటి జనరేషన్ లో వస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోల దాకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ నమోదు చేసుకున్నాయి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాలు హిందీలో రీమేక్ చేశారు అవి అక్కడ హిట్ అయ్యాయో ఫ్లాప్ అయ్యాయో ఒకసారి చూద్దాం…
ఒక్కడు

గుణశేఖర్ దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు ప్రొడ్యూసర్ గా మహేష్ బాబు హీరోగా భూమిక హీరోయిన్ గా వచ్చిన ఒక్కడు సినిమా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. మహేష్ బాబు కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఒక్కడు సినిమా తెలుగులో పాత్ బ్రేకింగ్ మూవీ గా గుర్తింపు సాధించింది. ఆ సినిమాలో వేసిన చార్మినార్ సెట్ మాత్రం సినిమాకే హైలెట్ గా నిలిచిపోయిందని చెప్పాలి. అలాగే ప్రకాష్ రాజ్ విలనిజం అద్భుతంగా పండిందని చెప్పాలి అయితే మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పెద్ద హైలైట్ గా మిగిలింది అని చెప్పాలి ఇదిలా ఉంటే ఈ సినిమాను 2014 లో తేవ‌ర్ పేరుతో హిందీలో రిమేక్ చేశారు ర‌వింద్ర‌నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అర్జున్ క‌పూర్ సోనాక్షి సిన్హా మ‌నోజ్ వాజ్ పేయ్ లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు తెలుగులో హిట్ అయిన ఈ సినిమా హిందీలో ప్లాప్ గా మిగిలింది ఒకచోట హిట్టయిన సినిమా ఇంకో చోట కూడా హిట్ అవ్వాలని రూలేం లేదు…
అతడు
మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా త్రిష హీరోయిన్ గా వచ్చిన అతడు సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకి ఎంత ఫాలోయింగ్ ఉందంటే ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా విడిచిపెట్టకుండా చూసే జనాలు చాలామందే ఉన్నారు అలాంటి అతడు సినిమా బాలీవుడ్ లో ఏక్ ద పవర్ ఆఫ్ వన్ అనే పేరుతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు బాబీ డియోల్ శ్రియా హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా తెలుగు లో చేసిన మ్యాజిక్ హిందీలో చేయ‌లేక‌పోయింది. తెలుగుకి హిందీలో వచ్చే సరికి కొన్ని మార్పులు చేర్పులు చేయడం తో హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చలేదు దాంతో ఈ సినిమా అక్కడ ఫ్లాప్ గా మిగిలింది…
పోకిరి
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది ఈ సినిమా ద్వారా మహేష్ బాబులో ఒక కొత్త నటుడిని బయటికి తీసాడు పూరి ఈ సినిమాతో మహేష్ బాబు పూర్తి మాస్ హీరోగా మారిపోయాడు ఇలాంటి సంచలన విజయం సాధించిన ఈ సినిమాని హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా వాంటెడ్ అనే పేరుతో తెరకెక్కించారు అప్పటివరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ కి మంచి విజయాన్ని అందించింది ఈ సినిమా అలాగే బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీ హిట్ కొట్టింది…

Latest News

Related News