Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు-నమ్రత జంటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యామిలీగా వీరికి పేరుంది. ఉంటే ఇలాంటి ఫ్యామిలీ ఉండాలి అనేంతగా వీరు ఆకట్టుకుంటున్నారు. పైగా ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు లేకుండా, కాంట్రవర్సీలు లేకుండా వారి జీవతం సాఫీగా సాగిపోతోంది.
అయితే వీరిద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వంశీ సినిమా సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. మహేశ్ ముందుగా ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ కలిసి అతికొద్ది మంది సమక్షంలో పెండ్లి చేసుకున్నారు. అయితే నమత్ర కంటే ముందు మహేశ్ బాబు ఇంకో అమ్మాయిని ప్రేమించాడు.
ఆమె ఎవరో కాదండోయ్ బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా. వీరిద్దరి కాంబోలో రాజకుమారుడు సినిమా వచ్చింది. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి. పైగా ఇద్దరి జంట బాగుంది కాబట్టి పెండ్లి చేసుకుంటారేమో అంటూ పత్రికల్లో వార్తలు కూడా రాశారు కొందరు.
Mahesh Babu Loves Preity Zinta
కానీ వాటిలో ఏ మాత్రం నిజం లేదని అప్పట్లో క్లారిటీ ఇచ్చింది ప్రీతి జింతా. ఆ తర్వాత మహేశ్ బాబు నమ్రతను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి ఎఫైర్ రూమర్లు రాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు మహేశ్ బాబు.
Read Also : Samantha : చైతూను మళ్లీ టార్గెట్ చేసిన సమంత.. భగ్గుమంటున్న అక్కినేని ఫ్యాన్స్..!
Read Also : Sharwanand : భయంకర సమస్యతో బాధ పడుతన్న శర్వానంద్.. అందుకే పెండ్లి వాయిదా..?