Chiranjeevi And Venkatesh : టాలీవుడ్ లో సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ లకు ఉన్న ఇమేజ్ అందరికీ తెలుసు. చిరంజీవి సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ ను ఏలేవి. అయితే అప్పట్లో ఓ యంగ్ హీరో చిరంజీవి, వెంకటేశ్ లను కూడా గడగడలాడించాడు. ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2000 సంవత్సరంలో చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్. వరుసగా లవ్ స్టోరీ సినిమాలతో హిట్లు కొట్టి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. 2001 సంవత్సరం సెప్టెంబర్ రెండో వారంలో ఆయన హీరోగా వచ్చిన మనసంతా నువ్వే సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత ఎమ్మెస్ రాజు భావించారు.
అదే సమయంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ మూవీని సెప్టెంబర్ 6న అంటే ఉదయ్ కిరణ్ సినిమా కంటే ముందు విడుదల చేయాలనుకున్నారు. ఉదయ్ కిరణ్ మూవీ వస్తే వెంకీ సినిమాకు కలెక్షన్లు తగ్గుతాయనే భావనతో ఎమ్మెస్ రాజును కాస్త లేటుగా రిలీజ్ చేయమని కోరాడు నువ్వునాకు నచ్చావ్ నిర్మాత.
Manasantha Nuvve Movie Became Hit Beyond Chiranjeevi Venkatesh Movies
దాంతో ఎమ్మెస్ రాజు రెండు వారాల తర్వాత రిలీజ్ చేయాలని భావించారు. కానీ అక్టోబర్ 4న చిరంజీవి హీరోగా వచ్చిన డాడీ సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. దాంతో ఆ మూవీ నిర్మాత కూడా ఎమ్మెస్ రాజును రిక్వెస్ట్ చేసి రెండు వారాల తర్వాత రిలీజ్ చేయమని కోరారు.
చేసేది లేక మనసంతా నువ్వే సినిమాను రెండు వారాల తర్వాత రిలీజ్ చేశారు. కానీ ఉదయ్ కిరణ్ సినిమా చిరంజీవి, వెంకటేశ్ సినిమాలను మించి పెద్ద హిట్ అయింది. దాంతో అప్పట్లో చిరు, వెంకీలను వణికించిన హీరో అంటూ ఉదయ్ కిరణ్ పేరు మార్మోగిపోయింది.
Read Also : Health Tips : వింటర్ లో ఆస్తమా ఉన్నవారు ఈ కేర్ తీసుకోకపోతే ఇక అంతే.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
Read Also : Jr NTR : సీనియర్ ఎన్టీఆర్ నుంచి తారక్ కు వారసత్వంగా వచ్చిన ఆస్తి ఎంతో తెలుసా..?