Manjari Fadnis Sensational Comments On Producer : ఈ నడుమ నటీమణులే కాకుండా హీరోయిన్లు కూడా కాస్టింగ్ కౌచ్ మీద ఓపెన్ అవుతున్నారు. ఒకరిని చూసి ఒకరు బయటకు వస్తున్నారు. తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీల దగ్గరి నుంచి స్టార్ హీరోయిన్ల దాకా ఈ విషయాలను బయట పెడుతున్నారు.
ఇక తాజాగా ఎన్టీఆర్ హీరోయిన్ మంజరి ఫడ్నీస్ కూడా సంచలన కామెంట్లు చేసింది. ఆమె తెలుగులో దాదాపు అరడజన్ సినిమాలు చేసింది. జూనియర్ ఎన్టీఆర్ చేసిన శక్తి సినిమాలో కూడా చేసింది ఈ భామ. దాంతో పాటు అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన రెండు సినిమాల్లో కూడా నటించింది.
కానీ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. అందుకు కారణాలు కూడా ఉన్నాయని లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అప్పట్లో నాకు చాలా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ ప్రతి చోటా నాకు ఘోరమైన అనుభవాలు ఎదురయ్యాయి. కొందరు నిర్మాతలు ఛాన్స్ ఇస్తే వారితో సెక్స్ చేయాలని కోరారు.
నిర్మాతలు, దర్శకులకు మనలోని అందం మాత్రమే కనిపిస్తుంది కానీ మన ట్యాలెంట్ కనిపించదు. అందుకే నేను హీరోయిన్ గా పెద్దగా సినిమాలు చేయలేకపోయాను అంటూ తెలిపింది ఈ భామ. మంజరి ఫడ్నీస్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మలయాళ సినిమాల్లో నటిస్తోంది ఈమె.