Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత విరూపాక్ష మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఆయనకు యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే. ఇక ఆయన తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ సపోర్టుతో ఇద్దరూ మంచి సినిమాలు చేస్తున్నారు.
కాగా సాయిధరమ్ తేజ్ తల్లిదండ్రుల గురించి చాలామందికి తెలియదు. ఆయన తల్లి విజయదుర్గ భర్త పంజా ప్రసాద్. అయితే వీరిద్దరూ చాలా కాలం క్రితమే విడిపోయారు. రీసెంట్ గా సాయితేజ్ తల్లి ఓ డాక్టర్ ను రెండో పెండ్లి చేసుకుంది. కాగా వీరిద్దరూ విడిపోవడానికి మెగా ఫ్యామిలీనే కారణమంట.
చిరంజీవి స్టార్ హీరో కాక ముందే పంజా ప్రసాద్ తో విజయదుర్గ పెండ్లి అయింది. అప్పటికే పంజా ప్రసాద్ ఫ్యామిలీ చాలా ఆర్థికంగా మంచి పొజీషన్ లో ఉంది. పైగా వెస్ట్ గోదావరి మొత్తం ఆనయకు పేరుంది. కానీ చిరంజీవి పెద్ద స్టార్ హీరో అయిన తర్వాత మెగా ఫ్యామిలీ అల్లుడికి కొన్ని కండీషన్లు పెట్టింది.
తాము చెప్పినట్టు వినాలంటూ కొన్ని కండీషన్లు పెట్టిందంట. అది నచ్చని ప్రసాద్ తన భార్యకు విడాకులు ఇచ్చేశారు. కానీ కొడుకులను మాత్రం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. తన కొడుకులకు ఆస్తులు కూడా ఇచ్చారంట. సాయితేజ్ కు యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారంట.
Read Also : Samantha : సమంతకు గుడి కడుతున్న అభిమాని.. ఫొటోలు వైరల్..!