Mega Fans Are Trolling Lavanya Tripathi : మెగా డాటర్ నిహారిక విడాకుల వార్త ఇండస్ట్రీని కుదిపేసింది. ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేస్తే మూడేండ్లు కూడా కలిసి ఉండకుండానే విడాకులు తీసుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. నాగబాబు తన ఒక్కగానొక్క కూతురు నిహారికను జొన్నలగడ్డ చైతన్యకు ఇచ్చి పెళ్లి చేసిన విషయం తెలిసిందే.
కానీ ఇద్దరి నడుమ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే ఈ పనే ఇప్పుడు లావణ్యకు శాపంగా మారిపోయింది. లావణ్య త్రిపాఠి రీసెంట్ గానే వరుణ్ తేజ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఇలా మెగా ఇంట్లో అడుగు పెట్టగానే నిహారిక విడాకుల వార్త బయటకు వచ్చింది.
ఇంకేముంది.. లావణ్య ఇలా వచ్చిందో లేదో అలా విడాకులు అయ్యాయి. ఆమెది ఐరన్ లెగ్. మెగా ఫ్యామిలీకి కలిసి రాదు అంటూ కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో.. లావణ్య వల్లే నిహారిక చెడిపోయిందని.. ఆమె వల్లే ఇలా బరితెగించి తిరుగుతోందని అంటున్నారు.
ఇలా రకరకాల పోస్టులతో లావణ్యను ఇరకాటంలో పడేస్తున్నారు నెటిజన్లు. తాను ప్రేమించిన వరుణ్ తో పెళ్లి కుదిరిందనే సంతోషం కన్నా.. నిహారిక చేసిన పని వల్ల ఇబ్బందులో పడ్డాననే బాధనే లావణ్యకు ఎక్కవగా ఉందంట. ఏదేమైనా నిహారిక చేసిన పని ఇప్పుడు లావణ్యకు శాపంగా మారిపోయింది.