Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో సినిమాలు చేశారు. అందులో చాలా వరకు ఆయనంటే ఇష్టపడే వారు కూడా ఉన్నారు. కానీ చిరంజీవి మాత్రం ఏనాడూ హద్దులు దాటలేదు. లిమిట్స్ దాటి ఎవరితో కూడా మిస్ బిహేవ్ చేయలేదు. అందుకే ఆయనపై ఎఫైర్ రూమర్లు కూడా పెద్దగా రాలేదు.
ఇక సినిమాల్లో లిప్ లాక్ లు కూడా ఇవ్వలేదు చిరంజీవి. అయితే ఘరానా మొగుడు సినిమా సమయంలో మాత్రం రాఘవేంద్ర రావు ఆయనతో బలవంతంగా లిప్ కిస్ ఇప్పించాడంట. హీరోయిన్ నగ్మతో ఓ సాంగ్ లో ఇలా లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కానీ చిరు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు.
తనకు పెండ్లి అయిందని ఇలాంటివి వద్దని చెప్పినా రాఘవేంద్ర రావు వినలేదు. సీన్ పండటం కోసం అవసరం అని చెప్పి ఒప్పించాడు. చిరు కూడా ఆయన చెప్పినట్టే లిప్ లాక్ ఇచ్చాడు. ఇక ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత చిరుకు తాను తప్పు చేశానని అనిపించింది. అందుకే వెంటనే అదే రోజు రాత్రి ఎడిటింగ్ ఆఫీస్ కు వెళ్లాడు.
నగ్మతో లిప్ లాక్ సీన్ ను డిలీట్ చేయించాడు. ఆ విషయాన్ని తర్వాత రాఘవేంద్ర రావుకు చెప్పాడు చిరంజీవి. ఇక చిరు అభిప్రాయాన్ని రాఘవేంద్ర రావు కూడా కాదనలేక పోయారు. అలా చిరంజీవి తన మీద మచ్చ పడకుండా చూసుకున్నారు. అందుకే ఆయన ఇండస్ట్రీని ఏలారు.
Read Also : Kajal Aggarwal : కాజల్ కు లవ్ ఎఫైర్ అంటూ వార్తలు వచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?
Read Also : Prabhas : ఆమె అంటే చాలా ఇష్టం.. ఆమె నా క్రష్.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు..!