Mega Star Chiranjeevi : పవన్ కల్యాణ్ అంటే అన్నయ్య చిరంజీవికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ తన తమ్ముడు కాదని తన కొడుకులాంటి వాడని ఎన్నోసార్లు చెప్పాడు. పవన్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. అన్నయ్య చిరంజీవి నాకు తండ్రి లాంటి వారని, ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానంటూ ఎన్నోసార్లు ప్రకటించాడు పవన్ కల్యాణ్.
మెగాస్టార్ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇక వ్యక్తిత్వంలో పవన్ ఎంతో మందికి ఆదర్శం అనేది అందరికీ తెలిసిందే. అలాంటి పవన్ కల్యాణ్ కూడా ఒక విషయంలో తనకు అస్సలు నచ్చడని గతంలో చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు.
పవన్ కల్యాన్ సాయం చేసే విషయంలో అస్సలు వెనక్కు రాడు. తనకు లేకపోయినా సరే ఇతరులకు సాయం చేసే గుణం అతనిది. కొన్ని సార్లు తన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా ఉన్నదంతా ఇచ్చేస్తుంటాడు. అది నాకు అస్సలు నచ్చదు. తన గురించి చూసుకున్న తర్వాత ఇతరులకు ఇస్తే బాగుంటుందని ఎన్నోసార్లు చెప్పాను.
కానీ పవన్ మాత్రం తన వద్దకు సాయం కోసం వస్తే తన గురించి ఆలోచించకుండా ఇస్తుంటాడు. అందుకే ఆయన్ను అంతమంది అభిమానిస్తున్నారు. పవన్ కోరుకున్న స్థానంలో ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు చిరంజీవి.
Also Read : Pawan Kalyan : పవన్ కల్యాణ్ మిస్ చేసుకున్న 5 బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?
Also Read : Anil Ravipudi : బుద్ధిలేని పని చేస్తున్న అనిల్ రావిపూడి.. నిర్మాతను ముంచేస్తున్నాడా..?