Karthika Deepam : oct 21 Episode : మోనిత ప్లాన్ కు షాక్‌లో దీప ఫ్యామిలీ.. ఆ న్యూస్ కార్తీక్‌ కంట ప‌డిందా…

Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘కార్తీక దీపం’ సీరియల్ అక్టోబర్ -21న 1,177 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. దీప వారణాసికి మంచి చెడులు చెప్పి వెళ్లొస్తానని చెబుతోంది. అయితే, కుటుంబంతో అమెరికా వెళ్ళాలని కార్తీక్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు ఏర్పాట్లు చేసుకుంటూనే మరోవైపు హాస్పిటల్ తాళాలు అందించడానికి ఆస్పత్రికి వెళ్తూ తన జీవితంలో జరిగినవన్నీ గుర్తుచేసుకుంటాడు కార్తీక్. మో నిత వల్లే తన జీవితంలో ప్రళయం వచ్చిందని అనుకుంటాడు. షాక్‌లో […].

By: jyothi

Updated On - Thu - 21 October 21

Karthika Deepam : oct 21 Episode : మోనిత ప్లాన్ కు షాక్‌లో దీప ఫ్యామిలీ.. ఆ న్యూస్ కార్తీక్‌ కంట ప‌డిందా…

Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘కార్తీక దీపం’ సీరియల్ అక్టోబర్ -21న 1,177 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. దీప వారణాసికి మంచి చెడులు చెప్పి వెళ్లొస్తానని చెబుతోంది. అయితే, కుటుంబంతో అమెరికా వెళ్ళాలని కార్తీక్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు ఏర్పాట్లు చేసుకుంటూనే మరోవైపు హాస్పిటల్ తాళాలు అందించడానికి ఆస్పత్రికి వెళ్తూ తన జీవితంలో జరిగినవన్నీ గుర్తుచేసుకుంటాడు కార్తీక్. మో

నిత వల్లే తన జీవితంలో ప్రళయం వచ్చిందని అనుకుంటాడు.

షాక్‌లో దీప కుటుంబసభ్యులు..

ఉదయాన్నే వచ్చిన పేపర్‌లో మోనిత జైలు నుంచి విడుదవుతుందని వార్త చూడగానే దీప కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. సౌందర్య షాక్‌తో ఆ న్యూస్ చూస్తుండగా అందులో ‘వింత ప్రేమికురాలు డా. మోనిత విడుదల..’ అనే హెడ్డింగ్‌ కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా గర్భం ధరించి.. డాక్టర్ కార్తీక్ తనను పెళ్లి చేసుకోవాలని.. అందుకోసం పలు నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న మోనిత.. గర్భవతి అయిన కారణంగా కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరైనట్టు న్యూస్ వస్తుంది.

ఈ విషయం తెలియడంతో దీప ఒక్కసారిగా అవాక్కవుతుంది. ‘ఏంటి అత్తయ్యా ఇది.. మోనిత మేము అమెరికాకు వెళ్లాక విడుదలైనా బాగుండేది కాదా అంటూ బాధపడుతుంటుంది. దాంతో దీపకు అందరూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఇంకొన్ని గంటలు ఓపిక పట్టు దీప.. కార్తీక్ రాగానే ప్రయాణం.. నువ్వు దిగులుపడకు’ అంటుంది సౌందర్య. ‘ఈ న్యూస్ పిల్లలకు తెలుస్తుందని భయపడకు.. దీనిని దాచేద్దాం.. అంటూ శ్రావ్య చేతులు వెనక్కి పెట్టి పేపర్ దాస్తుంది. వెంటనే దీప.. ‘హిమా.. సౌర్యా..’ అని పిలిచి.. శ్రావ్య దగ్గర నుంచి పేపర్ గుంజుకుని పిల్లలకు చూపిస్తుంది. మోనిత ఆంటీ విడుదలయ్యారట అని చెబుతుంది. పిల్లలు సరే.. మాకేందుకు ఈ విషయం చెబుతున్నావు అని.. అయిష్టంగా అంటారు. హిమ మాత్రం పేపర్ తీసుకుని తీసుకుని వెళ్లిపోతుంది.

monitha shocks to deepa family-1

monitha shocks to deepa family-1

డాక్టర్ భారతి ఇంట్లో ఏం జరిగింది..

కార్తీక్ డాక్టర్ రవిని కలిసేందుకు వాళ్లింటికి వెళ్తాడు. అక్కడ ఓ పోలీస్ కార్తీక్‌ను ఆపగా… రవి ఇంట్లో పనిచేసే వర్కర్ వచ్చి ‘మేడమ్ ఈయన మా సార్ వాళ్ల ఫ్రెండే’ అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్లి గార్డెన్‌లో కూర్చోబెడతాడు. ఇంతలో డాక్టర్ రవి, అతని భార్య భారతి గొడవ పడుతుంటారు. కారణం భారతి జైలు నుంచి విడుదల అయ్యాక మోనితను తన ఇంటికి తీసుకురావడమే.. అప్పటికే కార్తీక్ గార్డెన్‌లో కూర్చుంటాడు. దీంతో డాక్టర్ రవి భారతితో ఇలా ఎందుకు చేశావు. మనం కార్తీక్ దగ్గరకు వెళ్లాలని అనుకున్నాం కదా.. అంటూనే వెళ్లి మోనితకు ఏం కావాలో చూడు అని కోపంగా అంటాడు.

భారతి పైకి వెళ్లగా ‘ఏంటి భారతి భయపడుతున్నావా? మనం కార్తీక్ ను చూసేందుకు వెళ్దామని అనుకున్నాం కదా.. భయపడకు… చివరికు నీకు కూడా నేను లోకువ అయ్యానా’ అంటూ ఆమె చేతిలోని కప్పుని తీసుకుని కిందకు విసిరికొడుతుంది. ఆ సౌండ్‌కు గార్డెన్లో కూర్చున్న కార్తీక్.. ‘భారతి, రవి ఏదైనా గొడవ పడుతున్నారా? కాల్ చేసి చెబుదామని పైకి లేవగానే టేబుల్ మీద ఫ్లవర్ వాజ్‌ కాలు తగిలి కిందకు పడుతుండగా దానిని పట్టుకుని.. అక్కడే పెడుతూ.. మోనిత న్యూస్ చూసి షాక్ అవుతాడు కార్తీక్.

తిరిగి వెళదామని కార్తీక్‌ అనుకోగా.. పనివాడు వచ్చి ‘భారతి మేడమ్ రమ్మన్నారు’ అని చెప్పడంతో కార్తీక్ ఇంట్లోకి వెళతాడు. దీంతో కార్తీక్‌కు మోనిత ఎదురుపడుతుంది. అయితే, వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది. కార్తీక్, దీప అమెరికా వెళ్లకుండా మోనిత ఎలా ఆపుతుందో తెలియాంటే తరువాయి భాగం చూడాల్సిందే..

Tags

Related News