Mrunal Thakur Is Dating Arjit Taneja : సినీ తారలు ఈ నడుమ వరుసగా డేటింగ్ ల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ కో స్టార్లతో ప్రేమలో పడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా చాలామంది తమ రిలేషన్ ను బయట పెడుతున్నారు. కొందరు పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు మధ్యలోనే అన్నీ వదిలేస్తున్నారు.
అయితే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా ఇదే పంథాను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చిన అతికొద్ది సమయంలోనే చాలా ఫేమస్ అయిందని చెప్పుకోవాలి. సీతారామం సినిమాతో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఆమె అంతకు ముందే కుంకుమ్ భాగ్య అనే సీరియల్ తో ఫేమస్ అయింది.
Mrunal Thakur Is Dating Arjit Taneja
ఇందులో నటించిన ఆమె కోస్టార్ అర్జిత్ తనేజాతో సీరియస్ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. రీల్ కపుల్ గా అలరించిన వీరిద్దరూ.. రిలయ్ లైఫ్ లో డేటింగ్ చేస్తున్నారు. రీసెంట్ గా మృణాల్ బర్త్ డే సందర్భంగా అర్జిత్ చేసిన పోస్టుతో ఇది బయటకు వచ్చింది. మై లవ్ అంటూ ఓపెన్ అయిపోయాడు.
పైగా వీరిద్దరూ ఆఫొటోల్లో చాలా క్లోజ్ గా కనిపిస్తున్నారు. ఇది చూస్తుంటే వీరిద్దరూ సీరియస్ డేటింగ్ లో ఉన్నట్టు అర్థం అవుతోంది. మరి దీన్ని మృణాల్ బయట పెడుతుందా లేదా అనేది తెలియదు. కానీ ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సమయంలోనే ఇలా డేటింగ్ లు మొదలు పెట్టిందంటే మామూల్ది కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.