Mrunal Thakur : సమంత అంటే ఎంతో మంది అప్ కమింగ్ హీరోయిన్లకు ఒక స్ఫూర్తి దాయకం. ఆమె జర్నీ ఎంతో మందికి ఆదర్శం. అందుకే ఆమెను ఇన్ స్పిరేషనల్ గా తీసుకుని ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్ కావాలని కలలు కంటారు. అయితే తాజాగా సమంత నటించిన శాకుంతలం మూవీ కోసం చాలామంది ముందుకు వస్తున్నారు.
ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ కోసం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మృణాల్ ఠాకూర్ కూడా ముందుకు వచ్చింది. ఆమె సీతారామం మూవీతో ఎంత పెద్ద పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా సమంతను ఓ కోరిక కోరింది. నువ్వు నాకు చాలా ఇన్ స్పిరేషనల్ సామ్.. ఇక ఆగలేక పోతున్నా.. నీకు ఓ ప్రశ్న వేస్తున్నాను. మనం ఇద్దరం కలిసి ఓ మూవీకి ఎప్పుడు వర్క్ చేద్దాం ఓపెన్ గానే అడిగింది. అందుకు సమంత కూడా స్వీట్ గా రిప్లై ఇచ్చింది.
వావ్.. తప్పకుండా చేద్దాం అంటూ చెప్పింది. దీంతో ఇద్దరి పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఇద్దరు కోరుకున్నట్టు మూవీలో కలిసి నటిస్తారా లేదా అనేది మాత్రం చూడాలి.
Can’t wait to watch Shaakuntalam! You’re so inspiring Sam. My question to you is when are we working on a film together ????????? https://t.co/MSw8vATrMn
— Mrunal Thakur (@mrunal0801) April 9, 2023
Read Also : Surekha Konidela : చిరంజీవి భార్యను దారుణంగా అవమానించిన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే..?
Read Also : Uday kiran : ఉదయ్ కిరణ్ ను సినిమా నుంచి తీసేయాలని చూసిన రామోజీరావు.. చివరకు..!