Music-Magic : మ్యాజిక్ ని సృష్టించిన మ్యూజిక్

Music-Magic : మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుందని మరోసారి రుజువైంది. ‘‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్’’ ప్రోగ్రామ్ దీనికి వేదికైంది. ఈ కార్యక్రమం ఇవాళ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈటీవీలో ప్రసారమైంది. మామూలుగా ఈ అవార్డుల ప్రదానాన్ని ఏటా నిర్వహిస్తారు. ఆయా సంవత్సరాల్లో అభిమానులను అలరించిన పాటలను ఎంపిక చేస్తారు. కానీ 2020లో సినిమాలు పెద్దగా విడుదల కాకపోవటంతో నామినేషన్లు తీసుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో గత దశాబ్ధ కాలం(2010-20)లో రిలీజ్ అయిన చిత్రాల్లోని పాటల […].

By: jyothi

Updated On - Sun - 4 April 21

Music-Magic : మ్యాజిక్ ని సృష్టించిన మ్యూజిక్

Music-Magic : మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుందని మరోసారి రుజువైంది. ‘‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్’’ ప్రోగ్రామ్ దీనికి వేదికైంది. ఈ కార్యక్రమం ఇవాళ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈటీవీలో ప్రసారమైంది. మామూలుగా ఈ అవార్డుల ప్రదానాన్ని ఏటా నిర్వహిస్తారు. ఆయా సంవత్సరాల్లో అభిమానులను అలరించిన పాటలను ఎంపిక చేస్తారు. కానీ 2020లో సినిమాలు పెద్దగా విడుదల కాకపోవటంతో నామినేషన్లు తీసుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో గత దశాబ్ధ కాలం(2010-20)లో రిలీజ్ అయిన చిత్రాల్లోని పాటల నుంచి ‘బెస్ట్ ఆఫ్ ది డికేడ్’ అనదగ్గ సాంగ్స్ ని సెలెక్ట్ చేశారు. గడచిన పదేళ్లలో ఒక్కో కేటగిరీలో విన్నర్లుగా నిలిచినవాళ్లను నామినీలుగా స్వీకరించారు. అందులోంచి ‘బెస్ట్ ఆఫ్ ది బెస్ట్’ని జ్యూరీ సభ్యులు ఎంపిక చేసి అవార్డులు ఇచ్చారు.

జ్యూరీ సభ్యులు..

విజేతలని ఎంపిక చేసిన జ్యూరీలో సీనియర్లతోపాటు జూనియర్లు కూడా ఉన్నారు. వాళ్ల జాబితా.. సురేష్ బాబు, మధుర శ్రీధర్, జీవితా రాజశేఖర్, భాష్కర్ భట్ల, కౌసల్య, కల్యాణి కోడూరి, ఎంఎం శ్రీలేఖ, హసన్ రాజా, రఘు కుంచె, సునీత, తనికెళ్ల భరణి.

పెర్ఫార్మెన్స్ కేక: Music-Magic

రోల్ రైడా ర్యాప్ మ్యూజిక్, రెజీనా కసాండ్రా స్టెప్పులు, శ్రద్ధాదాస్ డ్యాన్స్, హైపర్ ఆది పంచ్ లు, జబర్దస్త్ టీమ్ కామెడీ కిట్లు, ప్రముఖ గాయని సునీత ఆలపించిన మధురమైన పాటలు ఈ వేడుకలో పాల్గొన్నవారిని ఆనందంలో ఓలలాడించాయి. దీంతో వాళ్లు కేకలు, ఈలలు, అరుపులతో హోరెత్తించారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

విజేతలు..

‘బెస్ట్ ఆఫ్ ది డికేడ్’ అవార్డు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ రూపొందించిన ‘‘లవ్ యు అప్పా’’ సాంగ్ ని వరించింది. లైఫ్ టైం అఛీవ్మెంట్ పురస్కారాన్ని సీనియర్ సింగర్ కేఎస్ చిత్రకి హీరో కమల్ హాసన్ అందజేశారు. ఆమెకి ‘‘క్వీన్ ఆఫ్ ది మెలోడీ’’ కిరీటాన్ని అలంకరించారు. పద్మభూషణ్ కమల్ హాసన్ దేశ సినిమా రంగానికి 60 ఏళ్లుగా అందిస్తున్న సేవలకి గుర్తుగా ప్రత్యేకంగా సత్కరించారు.

బాలూ.. కన్నీళ్లు: Music-Magic

అప్పటివరకూ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో గాయని సునీత, గాయకులు మనో, అనురాధా శ్రీరామ్.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటలను పాడటంతో అభిమానులకు ఆ లెజెండరీ గుర్తొచ్చారు. గాన గంధర్వుణ్ని తలచుకొని ప్రతిఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. అందరూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అక్కడి వాతావరణం బరువెక్కింది. సింగర్ అనురాగ్ కులకర్ణికి ‘ఎస్పీబీ అవార్డ్ ఫర్ ది మోస్ట్ మెలోడియస్ సింగర్ ఆఫ్ ది డికేడ్’ అవార్డును బహూకరించారు. బుట్ట బొమ్మ పాట ‘ది వైరల్ సాంగ్’గా, సినిమా చూపిస్త మామా అనే పాట ‘లిజనర్స్ ఛాయిస్ సాంగ్’గా, అత్తారింటికి దారేదిలోని పాటలన్నీ ‘లిజనర్స్ ఛాయిస్ ఆల్బమ్’గా ఎంపికయ్యాయి.

Latest News

Related News