N. T. Rama Rao : ఆయన డూప్ పాత్ర పోషించిన పృథ్వీని పిలిచి ఎన్టీఆర్ ఆ మాట అన్నారట..

N. T. Rama Rao : నందమూరి తారక రామారావు సినిమా రంగంలోనే కాదు.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రజలకు తనదైన స్థాయిలో సేవ చేశారు. అయితే, ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ భోళా మనిషిగానే ఉండేవారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఇకపోతే సినీ రంగంలో ధృవతారగా వెలుగు వెలిగిన తర్వాత 1982లో తెలుగు దేశం పార్టీ స్థాపించి, పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే […].

By: jyothi

Published Date - Sat - 30 October 21

N. T. Rama Rao : ఆయన డూప్ పాత్ర పోషించిన పృథ్వీని పిలిచి ఎన్టీఆర్ ఆ మాట అన్నారట..

N. T. Rama Rao : నందమూరి తారక రామారావు సినిమా రంగంలోనే కాదు.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రజలకు తనదైన స్థాయిలో సేవ చేశారు. అయితే, ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ భోళా మనిషిగానే ఉండేవారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు.

ఇకపోతే సినీ రంగంలో ధృవతారగా వెలుగు వెలిగిన తర్వాత 1982లో తెలుగు దేశం పార్టీ స్థాపించి, పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ప్రజల కోసం వినూత్నమైన పథకాలు రూపొందించి సేవ చేశారు ఎన్టీఆర్. అయితే, చాలా సార్లు ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని చాలా మంది సినీ ప్రముఖులు ప్రయత్నించారట. ఈ విషయమై ఎన్టీఆర్‌కు చెప్పగా, దానికి ఆయన స్పష్టంగా సమాధానమిచ్చారట. తనను పెంచి పోషించిన ప్రజల కోసం తాను రాజకీయం అనే కంపులోకి దిగి, దానిని కడిగి ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నానని మీరు రాకండి బ్రదర్ అని చెప్పేవాడట. తాను ఇబ్బందులు పడటానికి సిద్ధపడే ఈ రాజకీయాల్లోకి వచ్చానని, మీరు ఇందులోకి వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారట.

ఇకపోతే ఒకానొక సమయంలో ఎన్టీఆర్ సన్మాన కార్యక్రమం నిర్వహించగా, ఆ కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్..తనకు నాగేశ్వర్ రావు లేని లోటు స్పష్టంగా కనబడుతుందని నిర్వాహకులకు చెప్పాడు. దాంతో సినీ పెద్దలు, నిర్వాహకులు వెంటనే అక్కినేని నాగేశ్వర్‌రావు‌ను పిలిపించి సన్మాన కార్యక్రమం పూర్తి చేశారు. అప్పటి వరకు ఎన్టీఆర్, అక్కినేని మధ్య ఏవో స్పర్థలు ఉన్నప్పటికీ ఆ కార్యక్రమం తర్వాత వారిరువురు కలిసే ఉన్నారు. ఎన్టీఆర్ తాను చనిపోయేంత వరకు అక్కినేని నాగేశ్వర్‌రావుతో స్నేహంగానే ఉన్నారు.

N. T. Rama Rao

N. T. Rama Rao

ఈ సంగతులు పక్కనబెడితే..ఎన్టీఆర్ చాలా సార్లు తనకు నచ్చిన నటులను అభినందిస్తుంటారు. అలా ఓ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించిన కమెడియన్ పృథ్విరాజ్‌ను పిలిపించుకుని మరి అభినందించారట. సినిమాలో పాత్ర ప్రకారం పృథ్విరాజ్ తనను తిట్టినప్పటికీ పాత్ర పరంగా గొప్పగా నటించావని పృథ్విరాజ్‌ను మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ అభినందించారట. అటువంటి సంస్కారం ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అని సినీ ప్రముఖులు చెప్తుంటారు. అలా ఎన్టీఆర్ తనకు డూప్‌గా నటించిన పృథ్విరాజ్‌ను అభినందించడం నిజంగా విశేషం.

అలా ఎన్టీఆర్ ఆయనొక్కడినే కాదు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును కూడా అభినందించారు. ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు ఎన్టీఆర్ పాత్రను పోషించాడు. ఆ సినిమా చూసి టీడీపీ శ్రేణులు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశాయట. అయితే, ఆ పాత్ర పోషించిన కోట చాలా భయపడిపోయాడు. ఒకసారి ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ కనబడినపుడు ఆయన పాదాలపై పడినపుడు ఎన్టీఆర్ కోటను లేపి.. మీ గురించి విన్నాం.. బాగా నటించండి.. ఆరోగ్యంగా ఉండండని చెప్పాడు. అలా ఎన్టీఆర్ భోళా వ్యక్తిత్వం గురించి సినీ ప్రముఖులు చాలా సార్లు చెప్తుంటారు.

Tags

Latest News

Related News