N. T. Rama Rao : సినిమా అంటే ఒక్కరిద్దరు కాదు.. అది కొంత మంది వ్యక్తుల ఉమ్మడి శ్రమ అని చెప్పొచ్చు. డైరెక్టర్, నటీనటులు, గాయకులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, ఫైట్ మాస్టర్స్, స్టోరి రైటర్స్ ఇలా పలు విభాగాలకు చెందిన వారు కొంత కాలం పాటు పని చేస్తేనే సినిమా బయటకు వస్తుంది. ఇక పెద్ద హీరోల సినిమాలు అయితే ఇంకా ఎక్కువ మంది పని చేస్తారు.
తెలుగు తెరపైన, తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నట రత్న నందమూరి తారక రామారావు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ ధృవతారగా వెలుగొందాడు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే చాలు.. జనాలు విరగబడి చూసేవారు. అటువంటి ఎన్టీఆర్, ఆయన తనయుడు బాలకృష్ణ నటించిన ఓ సినిమా ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు.. అదేంటంటే..
నందమూరి బాలకృష్ణతో ఓ భారీ జానపద చిత్రం చేయాలనుకున్న ప్రొడ్యూసర్ ఉప్పలపాటి విశ్వేశ్వర్‌రావు అనుకున్నాడు. అందులో భాగంగా తొలుత ‘కంచుకోట’ అనే చిత్రం ప్రొడ్యూస్ చేశాడు. ఈ చిత్రానికి కథ ప్రొడ్యూసర్ విశ్వేశ్వర్‌రావు అందించగా, కెఎస్ రావు దర్శకత్వం వహించాడు. ఇందులో కాంతారావు కీలక పాత్ర పోషించగా, సావిత్రి, దేవిక హీరోయిన్స్. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక మరో సినిమా ప్లాన్ చేశాడు ప్రొడ్యూసర్ విశ్వేశ్వర్‌రావు. అదే ‘కంచు కాగడా’. భారీ జానపద చిత్రంగా దీనిని తెరకెక్కించాలనుకున్నాడు. హీరోయిన్‌గా జమున ఫైనల్ అయింది.
N. T. Rama Rao
ఎన్టీఆర్, కాంతారావుపై కొన్ని సీన్స్ చిత్రీకరించారు కూడా. అంతలోనే జమున ప్రగ్నెంట్ కాగా కొన్ని రోజులు సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆమె ప్రసవం తర్వాత బాలకృష్ణ, జమున, ఇతర ఆర్టిస్టులతో మిగతా భాగం షూట్ చేయాలనుకున్నారు. అందుకు సీనియర్ ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పారు. ఇంతలో ఈ సినిమా కీ రోల్ ప్లే చేయాల్సిన బాలీవుడ్ హీరో చనిపోవడంతో మళ్లీ షూట్ వాయిదా పడింది. అలా కంటిన్యూయస్‌గా పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది. ఆ తర్వాత ఈ సినిమాను పూర్తి చేయాలనుకుని నటశేఖర కృష్ణ భావించాడు. కానీ, సాధ్యపడలేదు. బాలకృష్ణ కూడా ఈ సినిమా పూర్తి చేయాలనునకున్నాడు. కానీ, ‘కంచు కాగడ’ చిత్రం ఇంతవరకూ పూర్తికానే లేదు.
‘కంచు కాగడ’ వంటి విడుదలకు నోచని చిత్రాల జాబితాలో చాలా సినిమాలే ఉన్నాయి. దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరిమువ్వల సింహనాదం’, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సింహపురి సింహం’ చిత్రం ఇలా ఇబ్బందులు ఎదుర్కొన్నవే.